ప్రొ.నాగేశ్వర్ : సీమాంధ్రులు కేటీఆర్ మాటలకు కరిగిపోతారా..?

తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు సీమాంధ్ర ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం ప్రారంభించింది. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఓటర్లతో.. కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. కేసీఆర్ తనయుడిగా.. ఆంధ్రులకు తాను భరోసా ఇస్తున్నానంటూ ప్రకటనలు చేస్తున్నారు. కేసీఆర్‌ ఆంధ్రులను విమర్శిస్తున్నారు. కేటీఆర్ హామీలు ఇస్తున్నారు. ఏమీ జరగకపోతే.. కేటీఆర్ హామీ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి..? కేసీఆర్ మాటల వల్ల ఓట్లు పోతాయన్న భయం లేకపోతే.. ప్రత్యేకంగా… కూకట్ పల్లి, శేరిలింగంపల్లి ఓటర్లతో సమావేశం పెట్టి.. భద్రతకు హామీ ఇస్తున్నానని చెప్పడం ఎందుకు..?. మిగతా పార్టీలు చెప్పడం లేదు కదా..! దీనికి కారణం ఏమిటి..?

కాంగ్రెస్ – టీడీపీ కూటమి గ్రేటర్‌లో అజేయంగా కనిపిస్తోందా..?

తెలంగాణ ఉద్యమ సమయంలో.. తెలంగాణ వాదాన్ని పెంపొందించడానికి… తెలంగాణ సెంటిమెంట్‌ను పెంచడానికి ఆంధ్రా అనే పదాన్ని పదే వదే వాడుకున్నారు. ఉద్యమ సమయంలో చాలా సార్లు… మేం తెలంగాణకు పొట్టు చేత పట్టుకుని వచ్చిన వారికి వ్యితరేకం కాదు.. ఆంధ్ర పెట్టుబడిదారులకు.. ఆంధ్ర దోపిడీదారులుక వ్యతిరేకం అన్నట్లు మాట్లాడారు. కానీ ఏం జరిగింది..? .తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… తొలి నాళ్లలోనే 1956 కన్నా ముందు తెలంగాణలో ఉన్న వాళ్లే స్థానికులని ఓ ఆర్డర్ తీసుకొచ్చారు. తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చిన తర్వాత.. దాన్ని మార్చారు. ఇప్పటికీ.. ఆంధ్రులు.. ఆంధ్రులు అని విమర్శించడం మనం చూశాం. 2014 ఎన్నికల్లో… తెలంగాణ ఉద్యమ సమయంలో… ఎన్నికలు జరిగితే… గ్రేటర్ హైదరబాద్ లో టీఆర్ఎస్ గెలవలేదు. టీడీపీ, బీజేపీ గెలిచింది. ఎంపీ సీట్లు కూడా.. టీడీపీ, బీజేపీకి రెండు సీట్లు వచ్చాయి. ఎమ్మెల్యే సీట్లు కూడా.. ఆ కూటమికి 20 సీట్లు వచ్చాయి. వీటిలో అత్యధికంగా గ్రేటర్‌లోనే వచ్చాయి. మళ్లీ టీడీపీ బలపడుతుందనే ఉద్దేశంతోనే.. టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలందర్నీ టీఆర్ఎస్‌ ఆకర్షించింది. పార్టీలో చేర్చుకున్నారు. టీడీపీని పూర్తిగా బలహీనం చేశారు.

కాంగ్రెస్‌పై సీమాంధ్రుల్లో కోపం తగ్గిపోయిందా..?

ఆ తర్వాత కూడా.. సీమాంధ్రుల కాలిలో ముల్లు గుచ్చుకుంటే తీస్తానన్న ప్రకటన చేశారు. కానీ.. గుచ్చుతుంది టీఆర్ఎస్సే.. కానీ.. తీస్తానంటోంది టీఆర్ఎస్సే. తీయడం ఎందుకు… గుచ్చడం ఎందుకు..? కారణం ఏదైనా కానీ.. గ్రేటర్ ఎన్నికల్లో సీమాంధ్ర ఓటర్లు టీఆర్ఎస్‌కు ఓట్లేశారు. ఫలితంగా… ఆ పార్టీకి వంద వరకు కార్పొరేటర్ సీట్లు వచ్చాయి. కానీ 2018 ఎన్నికలకు వచ్చే సరికి పరిస్థితి మారింది. గత ఎన్నికల్లో.. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అప్పుడు… టీడీపీ మేజర్ పార్టనర్. బీజేపీ కాదు. ఇప్పుడు…కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు… టీడీపీ మేజర్ పార్టనర్ కాదు. అయినప్పటికీ.. టీడీపీ ప్లస్ బీజేపీ కన్నా… టీడీపీ ప్లస్ కాంగ్రెస్‌కు బలం ఎక్కువగా ఉంటుంది. గ్రేటర్‌లో.. టీడీపీ – బీజేపీ కూటమి కన్నా.. ఎలా చూసినా.. కాంగ్రెస్, టీడీపీ కూటమి బలంగా ఉంటుంది. దీనికి తోడు.. సీమాంధ్ర ఓటర్లలో…ప్రత్యేకహోదా ఇవ్వలేదన్న కోపం ఉంది. కాంగ్రెస్‌పై గత ఎన్నికల్లో ఉన్నంత కోపం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు.

కూటమి గెలిస్తే చందర్బాబు చేతిలో ప్రభుత్వం ఉంటుందా..?

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఏపీలో… ప్రధానమంత్రిగా ఎవరు కావాలంటే.. రాహుల్ గాంధీ పేరు చెబుతారు. తెలంగాణలోనూ రాహుల్ గాంధీకే ప్రజల ప్రయారిటీ ఉంది. అంటే.. సీమాంధ్ర ఓటర్లలో… బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్‌పై అనుకూలత లేకపోవచ్చు కానీ… కోపం అయితే లేదు. అందుకే… చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వచ్చారు. అందుకే సీమాంధ్ర ఓటర్లలో… టీడీపీ-కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఉంటుందేమోనన్న ఉద్దేశంతోనే… కేసీఆర్ చంద్రబాబునాయుడుని టార్గెట్ చేస్తున్నారు. మహాకూటమి తరపున.. ముఖ్యమంత్రి అయ్యేది.. తెలంగాణ వ్యక్తి కాదు.. అని చెప్పాలని.. కేసీఆర్ తాపత్రయ పడుతున్నారు. అలా చెప్పడం వల్ల… సీమాంధ్ర ఓటర్ల వల్ల నెగెటివ్ ప్రభావం ఉంటుంది. ఓ రకంగా.. సైడ్ ఎఫెక్టులు ఉండే.. యాంటీబయాటి్క్స్ ను పాలిటిక్స్‌లో కేసీఆర్ ప్రయోగించారు. దీని వల్ల ఇంపాక్ట్.. సీమాంధ్ర ఓటర్ల పై పడింది. అందుకే వారిని బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నార.ు

అమరావతికి రూ. వంద కోట్లు ఇప్పుడైనా ఇవ్వొచ్చు కదా..!

అమరావతికి వంద కోట్లు ఇద్దామనుకున్నాం కానీ.. మోడీ బాధపడతాడని ఇవ్వలేదని కేటీఆర్ చెబుతున్నారు. మోడీ బాధపడితే..వీళ్లకేం బాధ..?. ఇవ్వదల్చుకుంటే… మోడీతో ఏం పని..?. కేసీఆర్ నిజంగా రూ. వంద కోట్లు ఇచ్చి ఉంటే.. తెలంగాణ ప్రజల ఔదార్యం.. సీమాంధ్ర ప్రజలకు తెలిసేది కదా..? లక్షన్నర కోట్ల బడ్జెట్‌తో వంద కోట్లు పెద్ద లెక్క కాదు..!. తెలంగాణ ప్రజల పట్ల.. సీమాంధ్ర ప్రజల్లో అభిమానం పెరిగేది కదా..! మోడీ.. బాధపడతాడని ఇవ్వలేదని చెప్పడం ఎందుకు..? అప్పుడు ఇవ్వకపోతే .. తర్వాత అయినా ప్రకటించవచ్చు కదా..! ఇవాళ కేసీఆర్.. ప్రకటించుకోవడం ఎందుకు..?. అమరావతి శంకుస్థాపన జరిగి మూడేళ్లయిపోయింది. ఇంత వరకూ… మధ్యలో ఎప్పుడూ ఈ విషయాన్ని చెప్పలేదు. ఇప్పుడు ఎన్నికలకు ముందుగానే చెబుతున్నారు. అందుకే ఇప్పుడు కేటీఆర్ వ్యూహాత్మకంగానే… చంద్రబాబును టార్గెట్‌ చేయడం వల్ల.. సీమాంధ్ర ఓటర్ల పై ప్రభావం పడుతుంది కాబట్టి.. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కేటీఆర్ ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.