ప్రొ.నాగేశ్వర్: రాహుల్ నోట మహాకూటమి మాట ఎందుకు రాలేదు..?

తెలంగాణ ఎన్నికల సమయంలో.. రాహుల్ గాంధీ ప్రచారం ప్రారంభించారు. వరుసగా ఒకే రోజు మూడు సభల్లో ప్రసంగించారు. అన్ని సభల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జనసేకరణ జరిపాయి. వారిని ఉద్దేశించి.. రాహుల్ గాంధీ.. చాలా ఉత్సాహంగా ప్రసంగించారు. కేసీఆర్ ను, మోడీని కలిపి విమర్శించారు. వారి వైఫల్యాలను ఎండగట్టారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా చెప్పారు. కానీ అందరికీ అర్థం కాని విషయం ఏమిటంటే.. వెళ్లిన ప్రతి చోటా.. కాంగ్రెస్ పార్టీకి ఓటమేయన్నారు కానీ.. మహాకూటమి మాటే ఎత్తకపోవడం.

మహాకూటమి నిలబడుతుందని రాహుల్‌కు నమ్మకం లేదా..?

ప్రస్తుతం తెలంగాణలో …రాజకీయాలు మహాకూటమి చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణకు ప్రతిపక్ష పార్టీల నేతలు ఎవరు మాట్లాడినా.. ముందుగా మహాకూటమి అంటూనే ప్రారంభింస్తున్నారు. కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జనసమితి, టీడీపీ కలిసి.. కేసీఆర్ ను ఓడిస్తాయని.. క్లియర్ .. రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. కానీ రాహుల్ గాంధీ ఉపన్యాసాల్లో మాత్రం… మహాకూటమి ప్రస్తావన రాలేదు. దీంతో… కాంగ్రెస్ పార్టీ మహాకూటమి ప్రస్తావన వదులుకుందా.. అన్న.. లోతైన విశ్లేషణ కూడా .. కొంత మంది చేస్తున్నారు. లేదా.. కాంగ్రెస్ పార్టీ తొందరపదల్చుకోలేదా..? మహాకూటమి ఏర్పాటుపై కాంగ్రెస్‌కే అనుమానాలున్నాయా..? ఏమవుతుంది..? మహకూటమి ఏర్పడుతుదా.. లేదా అన్న సందేహం ఎక్కువగానే ఉంది. ఎందుకంటే.. ఇంకా సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు. ఈ విషయంలో చిక్కు ముడి పడితే.. ఒక వేళ కూటమి సాధ్యం కాకపోతే… ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో.. రాహుల్ కూటమి ప్రస్తావన చేయలేదనేది మరో వాదన.

విపక్షాలను కలుపుకుని పోతామని కూడా ఎందుకు చెప్పలేదు..?

మహాకూటమి ప్రస్తావన లేకపోయినా… మోడీకి వ్యతిరేకంగా.. కేసీఆర్ కు వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని.. వెళ్తామని రాహుల్ గాంధీ ప్రకటించాల్సి ఉంది. ఎందుకంటే.. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. కానీ రాహుల్ గాంధీ ఈ విషయంలో చొరవ చూపలేదు. మహాకూటమి విషయంలో స్పష్టంగా ప్రకటన చేయాల్సింది. ఎందుకంటే.. ఇప్పటికే మహాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో తెలంగాణ జనసమితి, సీపీఐ అసంతృప్తితో ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో… రాహుల్ ఎందుకు మహాకూటమి గురించి స్పందించకపోవం ఆశ్చర్యం కలిగించేదే. ఆయితే కాంగ్రెస్ వర్గాలు చెప్పేదేమిటంటే.. ఇదే మొదటి పర్యటన. మళ్లీ వారంలో రాహుల్ గాంధీ రాబోతున్నారు. అన్ని అంశాలను ఒకే ఎన్నికల ప్రచారంలో.. ఎందుకు చెప్పాలన్న వాదన కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోతే కూటమి లేనట్లేనా..?

రాహుల్ మళ్లీ తెలంగాణకు వచ్చినప్పుడు మహాకూటమి ప్రధాన్యతను వివరిస్తారని.. మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తున్న అవశ్యకతను కూడా చెబుతారని అంటున్నారు. ఇక్కడే కాదు.. దేశవ్యాప్తంగా..మిత్రులతో కలిస్తామని రాహుల్ గాంధీ చెబుతారని అంటున్నారు. నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మిత్రులను కలుపుకోవాల్సిన ఆవశ్యకతలో ఉంది. కానీ రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ ఎన్నికల్లో కీలకమైన.. పార్టీగా ఉన్న.. కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు సిద్దం కాలేదు. అడిగినన్ని సీట్లివ్వలేదన్న కారణంగా.. బీఎస్పీ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తోంది. ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తులతో పోటీ చేయడం లేదు. అలాగే తెలంగాణలో పొత్తులు ఇంకా కొలిక్కి రాలేదు. రాబోయే కాలంలో మహాకూటమిగా బహిరంగసభ జరిగినప్పుడు.. కచ్చితంగా రాహుల్ గాంధీ పాల్గొంటారని చెబుతున్నారు.

అయితే రాహుల్ గాంధీ… మహాకూటమి మాట ఎత్తనంత మాత్రాన… మహాకూటమి విషయంలో.. కాంగ్రెస్ పార్టీ మరో ఆలోచనలో ఉందని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ఇంకా పూర్తి స్థాయిలో.. సీట్లసర్దుబాటు కాలేదు కాబట్టి… తొందర పడటం ఎందుకన్న భావనలో ఆయన ఉండి ఉండవచ్చు. లుకలుకలున్నమాట నిజమే కానీ.. కూటమిగా కాకుండా.. ముందుకెళ్తారని.. అంచనా వేయడం.. కరెక్ట్ కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.