రాష్ట్ర కాంగ్రెస్ పాత్ర గురించి రాహుల్ మాట్లాడ‌లేదే!

ఈ ఎన్నిక‌ల్లో ఏపీ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంట‌నేది ఇప్ప‌టికీ స్ప‌ష్టంగా క‌నిపించ‌ని ప‌రిస్థితి! ఏపీలో ప్ర‌చారం చెయ్య‌డానికి మ‌రోసారి రాష్ట్రానికి వ‌చ్చిన కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా ఆ స్ప‌ష్ట‌త ఇచ్చే ప్ర‌య‌త్నం చెయ్య‌లేదు. విజ‌య‌వాడ స‌భ‌లో ఆయ‌న ఎక్కువ‌గా మోడీ స‌ర్కారు విమ‌ర్శ‌లు, కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే పేద‌ల‌కు ఇవ్వ‌బోతున్న క‌నీస ఆదాయ భ‌రోసా వంటి అంశాల‌పైనే ఎక్కువ‌గా మాట్లాడారు. గ‌డ‌చిన ఐదేళ్ల‌లో మోడీ వ‌ల్ల దేశం అన్ని ర‌కాలుగా న‌ష్ట‌పోయింద‌నీ, పెద్దనోట్ల ర‌ద్దు వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఛిన్నాభిన్న‌మైంద‌న్నారు. దేశాన్ని రెండు ముక్క‌లు చేశారనీ, ఒక‌టి పేద‌ల దేశ‌మైతే, మ‌రొక‌టి కొద్దిమంది మాత్ర‌మే ఉన్న శ్రీ‌మంతుల దేశమ‌ని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పేద‌రికంపై పోరాటం చేస్తుంద‌నీ, కానీ మోడీ పేద‌ల‌పై యుద్ధం చేశార‌న్నారు.

ఏపీకి సంబంధించి అంశాల‌పై మాట్లాడుతూ… కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని మ‌రోసారి రాహుల్ గాంధీ చెప్పారు. మ‌న్మోహన్ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు ఏపీకి ఇచ్చిన ప్ర‌తీ హామీని తాము నెర‌వేరుస్తామ‌న్నారు. భాజ‌పా ఆంధ్రాని అన్ని ర‌కాలుగా నిర్ల‌క్ష్యం చేసింద‌ని ఆరోపించారు. మోడీ ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా తాత్సారం చేస్తుంటే, ఇక్క‌డున్న ప్రాంతీయ పార్టీలు ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేలేక‌పోయాయ‌న్నారు. ఏపీకి హోదా అనేది కేవ‌లం మ‌న్మోహ‌నో, లేదా ప్ర‌ధానమంత్రో ఇచ్చిన హామీ కాద‌నీ, దేశంలోని అన్ని రాజ‌కీయ పార్టీలూ ఆరోజున ఇచ్చిన హామీ అన్నారు.

ఓవ‌రాల్ గా రాహుల్ ప్ర‌సంగంలో ఎలాంటి మెరుపులూ విరుపులూ లేవు! మ‌రీ ముఖ్యంగా, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంట‌నేది ఆయ‌న చెప్ప‌లేదు. కేంద్రంలో అధికారంలోకి రాగానే హోదా అంటున్నారే త‌ప్ప‌, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు పోటీ ప‌డుతున్న కాంగ్రెస్ అజెండా ఏంట‌నేది రాహుల్ ప్ర‌స్థావించ‌లేదు. ఎమ్మెల్యేలుగా ఏపీలో కాంగ్రెస్ అభ్య‌ర్థులు ఎందుకు నిల‌బ‌డ్డారు, వారిని గెలిపించుకోవ‌డం కోసం పార్టీ ఏం చేస్తుంది, గెలిచిన‌వారి ద్వారా పార్టీ సాధించాల‌నుకుంటున్న రాజ‌కీయ ల‌క్ష్యాలేంటి… ఇవేవీ ఆయ‌న మాట్లాడ‌లేదు! ఇక్క‌డి ప్రాంతీయ పార్టీల‌పై కూడా ఆయ‌న నేరుగా విమ‌ర్శ‌లు చెయ్యలేదు. ఆంధ్రాలో స్థానిక స‌మ‌స్య‌లే ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ప్రాతిప‌దిక కదా! అలాంట‌ప్పుడు, స్థానికంగా కాంగ్రెస్ పాత్ర‌, పోరాటం, ప్ర‌య‌త్నం ఏదో ఒక‌టి ఉంద‌ని చెప్పుకోవాలి క‌దా! రాష్ట్రస్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రాతినిధ్యం బలంగా ఉండాలనేది రాహుల్ చెప్పలేకపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close