అంకుశం లాంటి స్టోరీతో..

బోల్డంత టాలెంట్ ఉన్నా యాటిట్యూడ్ వ‌ల్లే క‌నుమ‌రుగైపోయిన‌వాళ్లెంతో మంది ఉన్నారు. రాజ‌శేఖ‌ర్‌కి అవకాశాలు రాక‌పోవ‌డానికి కార‌ణం కూడా ఆ ఎటిట్యూడే అంటుంటారు ఆయ‌న గురించి తెలిసిన‌వాళ్లు. అయినా స‌రే.. రాజ‌శేఖ‌ర్ కోసం క‌థ‌లు పుడుతూనే ఉంటాయి. ఆయ‌న టాలెంట్ అలాంటిది. మ‌రోవైపు రాజశేఖ‌ర్ కూడా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఏది ప‌డితే అది చేయ‌కుండా.. ఈసారి హిట్టు కొట్టే సినిమానే చేయాల‌ని అని పంతం ప‌ట్టుకొని కూర్చున్నాడు. అందుకే ఈమ‌ధ్య ఎన్ని అవకాశాలు వ‌చ్చినా ‘నో’ చెప్పాడు. అయితే ప్ర‌వీణ్ స‌త్తార్‌… క‌థ‌ని మాత్రం అంగీక‌రించాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కార్య‌రూపం దాలుస్తోంది.

గుంటూర్ టాకీస్ తో త‌న కెరీర్‌లో తొలిసారి డ‌బ్బులొచ్చిన సినిమా తీశాడు ప్ర‌వీణ్ స‌త్తార్‌. ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ కోసం ఓ క‌థ రెడీ చేసుకొన్నాడు. ఇదో పోలీస్ స్టోరీ. అంకుశంలా ఇది కూడా ట్రెండ్ సెట్ట‌ర్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాడాయ‌న‌.
ఈ సినిమా కోసం రాజ‌శేఖ‌ర్ త‌న లుక్ సైతం మారుస్తున్నాడ‌ట‌. ఆల్రెడీ సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ఆగ‌స్టు చివ‌రి వారంలో సినిమా ప్రారంభం అవుతుంది.. త్వ‌ర‌లోనే ఈసినిమాలోని ఇత‌ర న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాలు తెలుస్తాయి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close