చ‌ర‌ణ్ తెగ క‌ష్ట‌ప‌డుతున్నాడుగా

బ్రూస్లీతో రామ్‌చ‌ర‌ణ్‌కి బొప్పి క‌ట్టింది. అంత‌కు ముందు గోవిందుడ అంద‌రివాడేలే కూడా గొప్ప సినిమా కాదు. బండ్ల గ‌ణేష్ ఆ సినిమాతో న‌ష్ట‌పోయాడు కూడా! అందుకే ఈసారి త‌నిఒరువ‌న్ రీమేక్ ని ఎలాగైనా హిట్ చేయాల‌న్న క‌సితో ఉన్నాడు చెర్రీ. త‌మిళంలో త‌ని ఒరువ‌న్ సంచ‌ల‌నాలు సృష్టించింది. స్ర్కిప్టు విష‌యంలో ఇహ చూసుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు. సాంకేతికంగానూ మంచి టీమే దొరికింది. అందుకే త‌న లుక్ ప‌రంగా జాగ్ర‌త్త‌లు తీసుకొంటున్నాడు చ‌ర‌ణ్‌.

ఈ సినిమా కోసం చ‌ర‌ణ్ గుర్ర‌పుస్వారీ నేర్చుకొంటున్నాడ‌ట‌. సైక్లింగ్‌లోనూ శిక్ష‌ణ తీసుకొంటున్నాడ‌ట‌. చ‌ర‌ణ్ మ‌గ‌ధీర స‌మ‌యంలోనే గుర్ర‌పుస్వారీ నేర్చుకొన్నాడు. అయితే… ఈ సినిమాలో గుర్రపు స్వారీ నేప‌థ్యంలో ఓ ఫైట్ ఉంద‌ట‌. ఆ ఫైట్ ర‌క్తిక‌ట్ట‌డానికి క‌ష్ట‌త‌ర‌మైన శిక్ష‌ణ తీసుకొంటున్నాడ‌ని చిత్ర‌బృందం తెలిపింది. అంతేకాదు… బ‌రువు త‌గ్గి త‌న బాడీ షేప్‌నీ మార్చుకొంటున్నాడు చ‌ర‌ణ్‌. ఈ సినిమాకి ధృవ అనే టైటిల్ పిక్స్ చేసిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో రెజీనా క‌థానాయిక‌. ఈ ద‌సరాకి ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close