తెలంగాణలో బీజేపీ లెక్క 65 సీట్లు..‍‍! ఇది రాంమాధవ్‌ జోస్యం..!

తెలంగాణ ఎన్నికల వేడి పెరిగే కొద్దీ.. ఒక్కొక్క బీజేపీ ముఖ్య నేత.. భారమైన ప్రకటనలు చేస్తున్నారు. మొన్న అమిత్ షా వచ్చి కరీంనగర్ లో గెలిచేస్తామన్నంతగా ప్రకటనలు చేసి వెళ్తే.. ఇప్పుడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ వంతు వచ్చింది. ఆయన తెలంగాణకు వచ్చి బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు గెలవబోతున్నామని ప్రకటించారు. అస్సాంలో కూడా అధికారంలోకి రాకముందు బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యేలే ఉన్నారని అయినా ప్రజలు పట్టం కట్టారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ గత నాలుగున్నరేళ్లలో 15 రాష్ట్రాల్లో గెలిచిందని గుర్తు చేశారు. ఐదుగురు ఎమ్మెల్యేల పార్టీగా ఉన్న తమకు అధికారం అప్పగించండి అని అనడానికి సంకోచంగా ఉండొచ్చని.. కానీ కురుక్షేత్ర మహా సంగ్రామంలో పంచ పాండవులే గెలిచారని చెప్పుకొచ్చారు.

రోజు అయిదుగురు ఎమ్మెల్యేలే కావచ్చు.. కానీ రేపు 65 మంది ఎమ్మెల్యేలు అవుతారని జోస్యం చెప్పారు తెలంగాణలో మతతత్వ, అవినీతి, రాచరిక, రాక్షస పాలనను అంతం చేయాలని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్‌ ప్రజలను కోరారు. అవినీతి రహిత, కుంటుంబ పాలన లేని సుపరిపాలన కోరే వారందరూ బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. మహాకూటమిపైనా రాంమాధవ్‌ విమర్శలు చేశారు. దివంగత ఎన్టీఆర్‌ రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెడితే.. ప్రస్తుత నాయకులు వారి నిజస్వరూపాన్ని బయటపెట్టారని మండిపడ్డారు. అందుకే ఆ పార్టీ తెలుగు ద్రోహుల పార్టీగా మారిందన్నారు. మోదీ కేబినెట్‌లో దేశ గౌరవమైన పోస్టుల్లో ఇద్దరు మహిళా మంత్రులున్నారని.. కానీ తెలంగాణలో మహిళల స్థానం ఏమిటని ప్రశ్నించారు. ఐదేళ్లు పరిపాలన చెయ్యలేక దివాళా తీసిన టీఆర్ఎస్‌ పార్టీకి మళ్లీ పరిపాలించే హక్కు ఉందా అంటూ రాంమాధవ్‌ ప్రశ్నించారు.

టీఆర్ఎస్ ను గెలిపించాడనికే.. బీజేపీ .. తెలంగాణలో ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తోందని సామాన్యులు కూడా నమ్ముతున్నారు. సామాన్యులే కాదు.. బీజేపీ నేతలు కూడా నమ్ముతున్నారు.అందుకే.. అటు అమిత్ షా కానీ.. ఇటు రామ్మాధవ్ కానీ.. ఎంత మంది వచ్చి… టీఆర్ఎస్ పై విమర్శలు చేసినా.. వాటిని ఎవరూ సీరియస్ గా తీసుకోవడంలేదు. దానికి కారణం… బహుశా.. పార్లమెంట్ లో మోదీ కేసీఆర్ పాలనను పొగడటమే కావొచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close