ఎన్నిక‌ల్లో పోటీ చెయ్య‌నంటున్న మాయావ‌తి వ్యూహమేంటి?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో తాను లోక్ స‌భ‌కి పోటీ చేయ‌డం లేద‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి. స‌మాజ్ వాదీ పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాదు, ప్ర‌స్తుతం యూపీలో ఈ కూట‌మిపైనే దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఎన్నిక‌ల త‌రువాత కేంద్రంలో ఈ కూట‌మి కీల‌కం కాబోయే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. త‌ద‌నుగుణంగానే కాంగ్రెస్ కూడా ఎస్పీ, బీఎస్పీలు పూర్తిగా దూరంగా ఉంటున్న ప‌రిస్థితి. ఇలాంటి స‌మ‌యంలో లోక్ స‌భ‌కు పోటీ చెయ్య‌నంటూ ప్ర‌క‌టించారు మాయావ‌తి. దీనికి ఆమె చెబుతున్న కార‌ణం… తాను పోటీలో ఉంటే త‌న‌వారంతా సొంత నియోజ‌క వ‌ర్గంలోనే ప‌రిమిత‌మౌతార‌నీ, తాను కూడా కాస్త ఎక్కువ ఫోక‌స్ పెట్టాల్సి ఉంటుంద‌న్నారు. తాను కావాల‌నుకుంటే ఎప్పుడై ఎంపీ కాగ‌ల‌న‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

మాయావ‌తి నిర్ణ‌యం వ్యూహాత్మ‌కమే. ఎందుకంటే, ప్ర‌స్తుతం యూపీలో కూట‌మికి ఆమె నాయ‌కత్వం వ‌హిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని స్థానాల్లోనూ ప్రచారం చేసి గెలిపించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అయితే, ఆమె ప్ర‌ధాని అభ్య‌ర్థి అనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు! అలాంటిది, ఆమె పోటీ చేయ‌క‌పోవ‌డ‌మేంటి అనే అభిప్రాయ‌లు కొన్ని స‌హ‌జంగానే వినిపిస్తాయి. కానీ, వాస్త‌వ ప‌రిస్థితి చూస్తే… 80 సీట్ల‌లో దాదాపు 40 నుంచి 45 సీట్లు మాయావ‌తి కూట‌మి గెలుస్తుంద‌నే అంచ‌నాలున్నాయి. ఎన్నిక‌లు ఫ‌లితాలు ఇలాగే ఉంటే.. దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకీ లేన‌న్ని ఎంపీ స్థానాలు మాయావ‌తి చేతిలో ఉన్న‌ట్టు లెక్క‌.

కాస్త క‌ష్ట‌ప‌డితే… జాతీయ రాజకీయాల్లో చ‌క్రం తిప్పే స్థాయికి మాయావ‌తి రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అందుకే, ఫోక‌స్ అంతా కూట‌మి ఎంపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించ‌డంపై పెట్ట‌డం కోస‌మే ఆమె ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని అనుకోవ‌చ్చు. గ‌త ఎన్నిక‌ల్లో మాయావ‌తి ప్రాతినిధ్య‌మే ఢిల్లీలో లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమెకి ఓప‌క్క భాజ‌పాని ఓడిస్తూనే… కాంగ్రెస్ కి ఎక్కువ సంఖ్య‌లో సీట్లు రాకుండా చేసుకోవాలి. ఈ ల‌క్ష్యాల‌న్నీ నెర‌వేరాలంటే ఎంతో వ్యూహాత్మ‌క‌త అవ‌స‌రం. ఇత‌ర ప్రాంతీయ పార్టీల‌తో పోల్చితే ఈ లోక్ స‌భ ఎన్నిక‌ల్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మాయావ‌తి తీసుకున్నార‌ని అనొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close