ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిజర్వ్ బెంచ్‌ను సిఫార్సులతో నింపేస్తున్నాయా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడటం అంటే.. జాతీయ జట్టుకు ఆడినట్లే. కనీసం ఏదైనా ఫ్రాంచైజీ ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకుంటే చాలన్నట్లుగా చాలా మంది యువ ఆటగాళ్ల కోరిక. ఫ్రాంచైజీలన్నీ ఇప్పుడు ఈ యువ ఆటగాళ్ల బెర్తులను సిఫార్సుల కోసం కేటాయిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఐపీఎల్ జట్టులో ఇరవై ఐదు మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చు. ఆటగాడి కనీస వేలం ధర రూ.20 లక్షలు. ముఖ్యమైన ఆటగాళ్ల కోసం రూ. కోట్లు వెచ్చిస్తున్న టీములు.. ఎక్కువ మందిని ఈ రూ.20 లక్షల కేటగిరిలో తీసుకుని నెట్స్‌లో ప్రాక్టీస్‌కో… మరో విధంగానో ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ ఆటగాళ్లందర్నీ మెయిన్ టెయిన్ చేయడం కష్టమవుతుందని చాలా కాలంగా టీములు సణుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది అ సణుగుడు కన్నా… సిఫార్సులకు ప్రాధాన్యం ఇచ్చి.. రెండు విధాలుగా లాభం పొందే ప్రయత్నాలు చేసినట్లుగా సెటైర్లు పడుతున్నాయి.

ముంబై ఇండియన్స్ టీమ్.. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను రూ.20 లక్షల బేస్ ప్రైస్ వద్దనే తీసుకుంది. అంతకు ముందు ఎవరూ తీసుకోలేదు. ఎవరూ తీసుకోలేదు కాబట్టి ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఎంఐ టీంకు.. సచిన్ టెండూల్కర్ మొదటి నుంచి పెద్ద దిక్కుగా ఉన్నారు. అర్జున్ ఏ స్థాయి క్రికెట్‌లోనూ గొప్పగా ప్రదర్శన చేసిన దాఖలాలు లేవు. సచిన్ టెండూల్కర్‌కు ప్రుత్సోత్సాహం కల్పించడానికే ముంబై ఇండియన్స్ ఓనర్లు రిలయన్స్ అంబానీలు అర్జున్ టెండూలర్కర్‌కు.. తమ ప్లేయర్ల ఇరవై ఐదు మంది కుర్చీల్లో ఒకటి అప్పగించారని విశ్లేషించడానికి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. అదే సమయంలో చెన్నై క్రికెట్ టీం .. కడపకు చెందిన హరి శంకర్ రెడ్డి ఆంధ్రా రంజీ ప్లేయర్‌ను రూ.20 లక్షల క్యాప్‌లో బేస్ ప్రైస్‌కు తీసుకుంది. హరి శంకర్ రెడ్డిని కూడా ఎవరూ తీసుకోలేదు.

నిజానికి 25 మంది ఆటగాళ్ల జాబితాలో పదకొండు మంది మాత్రమే తుది జట్టులో ఉంటారు. ఒకరిద్దరు తప్ప… పెద్దగా టోర్నీ మొత్తం మార్పులు ఉండవు. ఈ రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అసలు చోటు దక్కడం కూడా కష్టమే. హరిశంకర్ రెడ్డి గట్టి ప్రదర్శన చేసినట్లుగా ఎప్పుడూ మీడియాలో కూడా రాలేదు. అయితే అనూహ్యంగా చోటు దక్కింది. ఆయనకు ఏపీ అధికార పార్టీ నుంచి మద్దతు ఉందని.. చెన్నై టీం సీఎస్కే ఓనర్స్ అయిన ఇండియా సిమెంట్స్‌తో ప్రభుత్వ పెద్దలకు సన్నిహిత సంబంధాలున్నాయని.. ఆ దిశగా జరిగిన ప్రయత్నాలతోనే ఓ రూ. ఇరవై లక్షల క్యాప్‌లో హరి శంకర్ రెడ్డికి చోటు కల్పించారని తమిళనాడులో దుమారం రేగుతోంది.

నిజానికి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు… తమ గెలుపు అవకాశాల కోసం.. ఏ రాష్ట్ర జట్టు అయినప్పటికీ.. ప్రధాన ఆటగాళ్లలో ఆ రాష్ట్ర ఆటగాళ్లు ఉన్నారో లేదో చూసుకోకుండా ఎంపిక చేసుకుంటాయి. కానీ రిజర్వ్ బెంచ్ దగ్గరకు వచ్చే సరికి… ఐపీఎల్‌ టీంకు చెందిన రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లలో ప్రతిభావంతులకు చాన్స్ ఇస్తూంటారు. ఇదే విషయాన్ని తమిళనాడులోని క్రికెట్ ప్రేమికులు గుర్తు చేస్తున్నారు. పెరియస్వామి అనే యువ బౌలర్ గణాంకాలను వివరిస్తూ.. ఏ విధంగా హరి శంకర్ రెడ్డి మెరుగైన ఆటగాడో చెప్పాలని అంటున్నారు. స్థానిక ఆటగాళ్లను ప్రోత్సహించాలని సీఎస్‌కే టీంకు సలహాలిస్తున్నారు. వాళ్ల వల్ల ఎలాగూ ఉపయోగం ఉండదు కాబట్టి.. తమ వ్యాపార ప్రయోజనాల కోసం వచ్చే సిఫార్సులకు కేటాయిస్తున్నట్లుగా వీరి ఎంపిక ద్వారా తెలుస్తోందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close