‘నంది’ స్థానంలో ‘గ‌ద్ద‌ర్’ అవార్డులు

చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అందించే నంది అవార్డుల పేరు మారింది. ఈ పుర‌స్కారాల‌కు ‘గ‌ద్ద‌ర్ అవార్డులు’ అని నామ‌క‌ర‌ణం చేసింది తెలంగాణ స‌ర్కారు. ఈరోజు గ‌ద్ద‌ర్ జ‌యంతి. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. చాలాకాలంగా నంది అవార్డుల ప్ర‌దానం జ‌ర‌గ‌డం లేదు. కేసీఆర్ స‌ర్కారు వ‌చ్చిన కొత్త‌లో ‘సింహా’ పేరుతో అవార్డులు ఇస్తామ‌న్నారు. ప‌దేళ్ల‌లో ఒక్క‌సారి కూడా `సింహా` అవార్డుల గురించి కేసీఆర్ స‌ర్కారు ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణ‌లో కొత్త ప్ర‌భుత్వం కొలువు తీరింది. చిత్ర‌సీమ కూడా నంది అవార్డులు ఇవ్వ‌డం లేద‌న్న విష‌యాన్ని రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్లింది. నందిని పున‌రుద్ధ‌రిస్తామ‌ని రేవంత్ రెడ్డి చిత్ర‌సీమ‌కు మాట ఇచ్చారు. అన్న‌ట్టుగానే తొలి అడుగు వేశారు. ఓ క‌ళాకారుడి పేరుతో అవార్డులు స్థాపించి, చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు ఇవ్వాల‌నుకోవ‌డం స్వాగ‌తించాల్సిన ప‌రిణామ‌మే. ఇక ఈ విష‌యంలో మేల్కోవాల్సింది ఏపీ ప్ర‌భుత్వ‌మే. జ‌గ‌న్ రెడ్డి స‌ర్కారు ఉన్నంత కాలం… చిత్ర‌సీమ‌కు మొండి చేయే ఎదురైంది. త్వ‌ర‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌లో ప్ర‌భుత్వం మారితే – క‌చ్చితంగా టాలీవుడ్ కు ‘నంది’లో మ‌ళ్లీ నంది పుర‌స్కారాల క‌ళ రావొచ్చ‌న్న ఆశాభావం వ్య‌క్తం అవుతోంది,

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ఏపీ రాజధానేదో ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి !

పాలకుడు సొంత రాష్ట్రంపై కుట్రలు చేసుకునేవాడు అయి ఉండకూడదు. సొంత ప్రజల్ని నాశనం చేసి తాను ఒక్కడినే సింహాసనంపై కూర్చుని అందర్నీ పీల్చి పిప్పి చేయాలనే వ్యక్తిత్వం ఉండకూడదు. అలా ఉంటే...

ఎడిటర్స్ కామెంట్ : గుర్తుకొస్తున్నావయ్యా.. శేషన్ !

టీ.ఎన్.శేషన్. ఈ పేరు భారత్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా స్మరించుకుంటూనే ఉన్నారు. గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఆయనను మరిపించేలా మాత్రం ఎవరూ రావడం లేదు. ఎన్నికల సంఘం...

నిప్పుల కుంపటిలా తెలంగాణ..

తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మరింత ముదురుతున్నాయి. భానుడు ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో నాలుగైదు రోజులపాటు వేసవి తీవ్రత ఇలాగే ఉంటుందని.. ఎండతోపాటు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ...

రేవంత్ కు హైకమాండ్ అభినందనలు..ఎందుకంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రశంసల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ లేవనెత్తుతోన్న అంశాల ఆధారంగా కాంగ్రెస్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరుగుతోందని రేవంత్ పని తీరును...

HOT NEWS

css.php
[X] Close
[X] Close