బీజేపీలో చేరిపోతున్న రేవంత్ వర్గీయులు..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్గీయులుగా పేరు పడిన వారందరూ… ఒక్కొక్కరుగా బీజేపీలో చేరిపోతున్నారు. మొన్న కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ .. వెళ్లి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంతు వచ్చింది. విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లుగా ప్రకటించకపోయినా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు బీజేపీ తప్ప మరో మార్గం లేదు. ఆయన టీఆర్ఎస్ ఎంపీగా ఉండగా… ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్‌తో విబేధించి… రేవంత్ రెడ్డి చొరవతో కాంగ్రెస్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన ఆయన…  ఆ తర్వాత చురుగ్గా ఉన్నప్పటికీ… కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాలు ఆయనను వెనక్కి నెట్టేశాయి.

టీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఆయన…  సర్కార్ పై పోరాడాలని గట్టిగా అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్‌లోని పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించడంలేదు. అదే విషయం చెప్పి… పార్టీకి రాజీనామా చేశారు. ప్రభుత్వంపై పోరాటానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌కు మరో కీలక నేత దూరమయినట్లయింది. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో… కాంగ్రెస్ హైకమాండ్ నాన్చుతూండటంతో నేతల్లో నిరాశా నిస్పృహలు ఏర్పడుతున్నాయి. పోరాడే నేతల్ని పట్టించుకోకుండా… వర్గ రాజకీయాలకు తలొగ్గి.. .. పార్టీని నిస్తేజం చేయడం… వారిని అసంతృప్తికి గురి చేస్తోంది.

ఓ వైపు కాంగ్రెస్ కేంద్రంగా… కుట్రలు జరుగుతున్నాయని..కాంగ్రెస్ పార్టీకి మిగిలి ఉన్న ఓటు బ్యాంక్‌ను కూడా.. చెల్లాచెదురు చేయడానికి కొత్త పార్టీలు ఏర్పాటు చేస్తున్నారన్న చర్చలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు మేలుకోవడం లేదు. హైకమాండ్ చివరికి ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితులో రేవంత్ పై నమ్మకం పెట్టుకున్న నేతలు కూడా.. ఒక్కొక్కరు.. వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ హైకమాండ్ మేలుకుంటుందో లేదో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close