మాట‌మీద నిల‌బ‌డ‌వా… వ‌ర్మా?!

వ‌ర్మ అంతే. ఎప్పుడు ఏం అనిపిస్తే అది చేస్తాడు. ఏం తోస్తే.. అది చెప్తాడు. నిన్న మాట్లాడిన మాట ఈరోజు ఉండ‌దు. ఈరోజు ఉన్న అభిప్రాయం రేపు ఉండ‌దు. ఎప్పుడూ ఒకేలా ఉంటే బోర్ కొడుతుంది క‌దా?? అనేది వ‌ర్మ మాట కావొచ్చు. వినేవాళ్ల‌కు, చూసేవాళ్ల‌కు మాత్రం పిచ్చెక్కిపోవ‌డం ఖాయం. వ‌ర్మ ఈసారీ అల‌వాటు ప్రకారం మాట మార్చేశాడు. ఇక మీద‌ట తెలుగులో సినిమా చేయ‌ను గాక చేయ‌ను – వంగ‌వీటినే తెలుగులో నా ఆఖ‌రి సినిమా అంటూ కాస్త గ‌ట్టిగానే చెప్పుకొచ్చాడు ఆమ‌ధ్య‌. ఇంత గొప్ప క‌థ నాకు మ‌ళ్లీ దొర‌క‌దు గాక దొర‌క‌దు.. అందుకే నేనిలా ఫిక్స‌యిపోయా… అంటూ ఏవేవో వ్యాఖ్య‌లు చేశాడు. వ‌ర్మ అంత స్ట్రాంగ్‌గా చెప్పాడంటే, నిజ‌మే కాబోసు అని అల‌వాటు ప్ర‌కారం విన్న‌వాళ్లు కూడా త‌ప్పులో కాలేశారు. ఇప్పుడు ఆ మాట మ‌ర‌చిన వ‌ర్మ‌.. ‘నేను ఇంకో సినిమా తీస్తున్నా’ అంటూ ట్విట్టులో ఓ కూత కూశాడు.

తాజాగా వ‌ర్మ దృష్టి న‌యీంపై ప‌డింది. న‌యీం గొడ‌వ ప‌త్రిక‌ల్లో పెద్ద పెద్ద హెడ్డింగుల‌తో వ‌స్తుంటే, వ‌ర్మ ఇంత‌కాలం కామ్‌గా ఉలా ఉండ‌గ‌లిగాడో అర్థం కాలేదు. వ‌ర్మ త‌ప్ప‌కుండా న‌యీంపై కూడా ఏదో ఓ కూత కూస్తాడు, వీలుంటే సినిమా కూడా తీసేస్తాడు అని అంద‌రూ ఊహించారు కూడా. ఇప్పుడు అదే జ‌రిగింది. న‌యీం క‌థ‌పై బాగా స్ట‌డీ చేశాన‌ని, మూడు భాగాల్లో ఈ సినిమా తీస్తాన‌ని అల‌వాటు ప్ర‌కారం ట్విట్ట‌ర్‌లో బ‌రికేశాడు. అది తెలుగులోనా అన్న‌ది స్ప‌ష్టంగా చెప్ప‌క‌పోయినా.. తెలుగులో మాత్ర‌మే తీయ‌ద‌గ్గ సినిమా అది. కాబ‌ట్టి వ‌ర్మ మ‌రీ మూర్జ్ఞంగా ఆలోచించి హిందీలోనో, మ‌రో భాష‌లోనో తీయ‌డు. అంటే… వ‌ర్మ తెలుగులో మ‌ళ్లీ సినిమా తీయ‌ను అని కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పిన మాట‌.. ఇప్పుడు మ‌ర్చిపోయాడ‌న్న‌మాట‌. ఇప్పుడేమైనా అన్నామ‌నుకోండి. ”అప్పుడు అలా చెప్పాను క‌దా.. నిజ‌మ‌ని న‌మ్మారు.. ఇప్పుడు ఇలా చెబుతా. ఇది కూడా మీరు న‌మ్మాల్సిందే” అంటూ పిచ్చి లాజిక్కులు తీస్తాడు. ఆన‌క మ‌న‌కు పిచ్చెక్కిపోవాలి. న‌యీం సినిమా స‌రే. వంగ‌వీటి సినిమా ఏమైన‌ట్టో..?? నిన్న మొద‌లెట్టి, ఈరోజు పూర్తి చేసి, రేపు సినిమాని విడుద‌ల చేసే టాలెంట్ ఉన్న వ‌ర్మ‌.. వంగవీటి సినిమాని ఎన్ని రోజులు చెక్కుతాడో..?? నయీం క‌థ ప‌క్క‌న పెట్టి, ముందు ఆ సినిమా సంగ‌తేంటో చెబితే బాగుంటుంది క‌దా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close