పవన్… ట్రస్ట్ పెట్టుకో : రోజా విసుర్లు

జనసేనాని పర్యటన పూర్తయింది కానీ ఆయనపై విమర్శల యాత్ర మాత్రం వైసీపీ పూర్తి చేయడం లేదు. పవన్ పేరు ఎత్తితేనే వంటికాలి పై లేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా… బుధవారం కూడా ఆయన పై తన మాటల తూటాలు పేల్చారు.

గత ఎన్నికల్లో పవన్ వల్లే కాపులు టీడీపీ, బీజేపీ కూటమికి ఓటేశారన్నారు రోజా. అదే ఆ కూటమికి అధికారంలోకి వచ్చేలా చేసిందన్నారు. పవన్ కి స్క్రిప్ట్ రాస్తున్న వ్యక్తి ఎవరో గాని అతనికి రాజకీయ అవగాహన లేదన్నారు. పవన్ కేవలం ప్యాకేజీ పొలిటీషియన్ అంటూ ఎద్దేవా చేశారు. అలాంటి వాళ్లకు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయి అన్నారు. సేవ చేయాలంటే రాజకీయాలు మాత్రమే అవసరం లేదని చారిటీ ట్రస్ట్ పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. గజనీలా పవన్ అన్నీ మరచిపోకుండా ఎన్నికల సభల్లో మోడీ, చంద్రబాబు ఇచ్చిన హామీలు, మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోవాలని సూచించారు.

పవన్ పై వైసీపీ విమర్శల క్రమం చూస్తుంటే… పవర్ స్టార్ ఇక బాబు పక్షమే అని విపక్షం నిర్ధారణ కు వచ్చినట్టు కనపడుతోంది… అంతే కాక పవన్ మాట్లాడినా, సైలెంట్ గా ఉన్నా… అతని పై విమర్శల పర్వం మాత్రం కొనసాగాలని ఆ పార్టీ డిసైడ్ అయ్యినట్టుంది….

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close