‘జబర్ధస్త్‌’ విషయంలో ఆలోచన మారింది…రోజా

సినీనటి, వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌ రోజాను విపరీతంగా చికాకు పెట్టే అంశాల్లో టిడిపి లాంటి ప్రత్యర్ధులు మాత్రమే కాదు.. ఆమె జడ్జ్‌గా వ్యవహరిస్తున్న టీవీ షో జబర్థస్త్‌ది కూడా ప్రధానమైన పాత్రే. గత కొంత కాలంగా ఆమె ప్రత్యర్ధులకు అస్త్రంగా మారిందీ టీవీ షో. వెకిలి హాస్యానికి వేదికగా విమర్శలు అందుకుంటున్నప్పటికీ విజయవంతమైన కార్యక్రమంగా దూసుకుపోతున్న ఈ షో… ఎంతో మంది హాస్య కళాకారులను అమాంతం స్టార్స్‌ను చేసిందనేది నిజం. అదే సమయంలో రోజాకు ఈ షో ఆర్ధికంగా ఉపయోగపడిందేమో కానీ… రాజకీయంగా అంతకు మించి ఇబ్బందులకు గురిచేసింది. చేస్తోంది కూడా. గతంలో అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో మహిళల సమస్యల మీద మాట్లాడినప్పుడు గాని, మరికొన్ని సందర్భాల్లో కూడా జబర్ధస్త్‌నే ప్రత్యర్ధులు ప్రధాన అస్త్రంగా మలచుకుని రోజా నోటికి అడ్డుకట్ట వేశారు. అప్పట్లో ఈ విషయంలో వైసీపీ పార్టీ పెద్దలు కూడా రోజాకు పలు సూచనలు చేశారని, దీంతో ఈ షోకు ఆమె దూరం కావాలని నిర్ణయించుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. అకస్మాత్తుగా జబర్ధస్త్‌లో ఆమె సహ న్యాయ నిర్ణేత, సినీనటుడు నాగబాబు కుమార్తె నీహారిక ప్రత్యక్షమవడంతో ఇక రోజా జబర్ధస్త్‌కు గుడ్‌బై చెప్పేసినట్టే అని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఆమె ఆ షోలో యధాతధంగా కొనసాగుతూనే ఉన్నారు.

ఈ నేపధ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్నను ఎదుర్కున్న రోజా… ఒకానొక సమయంలో జబర్ధస్త్‌ను తాను విడిచిపెట్టాలనుకున్నట్టు అంగీకరించారు. అయితే ఈ విషయాన్ని కొందరు సన్నిహితుల వద్ద ప్రస్తావించినప్పుడు వారు వారించారని, ఆ కార్యక్రమం ఎంత విజయవంతమైందో, అది ఎన్ని ఇళ్లలో నవ్వుల పూలు పూయిస్తుందో తనకు వివరించారని అన్నారు. అంతేకాక ఈర్ష్య, ఆసూయలతో మాత్రమే చేసే విమర్శల్ని పట్టించుకోవల్సిన పనిలేదని గట్టిగా వాదించిన ఆప్తమిత్రుల, శ్రేయోభిలాషుల సూచనల మేరకు తాను ఆ షోని వీడే ఆలోచనను విరమించుకున్నానని స్పష్టం చేశారు. ఇక జబర్ధస్త్‌ని తానుగా వీడే ఆలోచన చేయబోనన్నారు. గత ఐదేళ్లుగా అత్యంత విజయవంతమైన ఈషో వల్ల ఎంతో మందికి వినోదాన్ని తద్వారా ఆరోగ్యాన్ని అందిస్తున్నామన్నారు. దీనితో పాటే గతంలో తాను సమర్పించిన రచ్చబండ టీవీ కార్యక్రమం కూడా మంచి విజయాన్ని సాధించిందని, ఎన్నో కుటుంబాలు కలవడానికి కారణమైందంటూ… అది తిరిగి ప్రారంభమైతే చేసే అవకాశం లేకపోలేదన్నారు. సో… జబర్ధస్త్‌ అభిమానులకు రోజా విషయంలో ఢోకాలేనట్టే…

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close