అభివృద్ధిలో విదేశీ విధానాలు మనకొద్దు! మోదీ ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ ఆదేశం?

విఫలమైన పాశ్చాత్య దేశాల అభివృద్ధి నమూనా స్ధానంలో భారతీయ అభివృద్ధి నమూనాను రూపొందించి అమలు చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) భారతీయ జనతా పార్టీ (బిజెపి) ల సమన్వయ సమావేశం నిర్ణయించింది. వచ్చే మూడుసంవత్సరాల తొమ్మిదినెలల నరేంద్రమోదీ పాలనకు ఇదే అజెండా అని లేదా మోదీకి ఆర్ఎస్ఎస్ ఆదేశమని అర్ధం చేసుకోవచ్చు. ఢిల్లీలో మూడు రోజులపాటు జరిగిన ఈ సమావేశంలో చివరిరోజు ప్రధానమంత్రి మోదీ పాల్గొన్నారు. ఆర్ ఎస్ ఎస్ అధిపతి మోహన్ భగత్ తో మోదీ చర్చించారు చివరిగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. సీనియర్‌ నేత దత్తాత్రేయ హోసబలే మీడియాతో మాట్లాడారు.

దేశ అంతర్గత, బాహ్య భద్రత గురించి మాట్లాడామని దత్తాత్రేయ హోసబలే చెప్పారు. దేశాన్ని ప్రభావితం చేసే అంశాలతో పాటు దేశ భద్రతకు కీలకమైన అంశాలపై చర్చలు జరిగాయని తెలిపారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందువల్ల ఈ చర్చలు జరిపామన్నారు. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించవలసి ఉందనే అభిప్రాయం వ్యక్తమైందన్నరు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం గురించి కూడా చర్చించామన్నారు.కలుపుగోలు అభివృద్ధి నమూనాను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పాశ్చాత్య దేశాల అభివృద్ధి నమూనాలు విఫలమయ్యాయని, మన దేశానికి తప్పనిసరిగా భారతీయ నమూనా ఉండాలని సమావేశం నిర్ణయించిందన్నారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణం గురించి ప్రశ్న వచ్చినపుడు ప్రభుత్వం తన ప్రణాళిక ప్రకారం ఏవిధంగా అమలు చేస్తుందో వేచి చూస్తామన్నారు.
ఆర్.ఎస్.ఎస్. రాజ్యాంగేతరశక్తిగా బిజెపిని శాసిస్తుందని కాంగ్రెస్ విమర్శించేది. ఇపుడు కూడా విమర్శిస్తూనే వుంటుంది. దేశ అంతర్గత, బహిర్గతల గురించి ప్రభుత్వాధినేతలు ఒస సంస్ధతో ప్రయివేటుగా చర్చించడం చిన్న విషయం కాదు మరి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా వున్నపుడు సోనియా గాంధీ ఆయనను ఇంటికి పిలిపించుకోవడం మొదలయ్యాక కాంగ్రెస్ “రాజ్యాంగేతర శక్తుల” పైచేసే విమర్శలకు విలువా, అర్ధమూ లేకుండా పోయాయి.

అదీకాకుండా ఆర్.ఎస్.ఎస్.లో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన మోదీ సహా జవదేకర్ మొదలుగా గల బిజెపి మంత్రులెవరూ ఆర్ ఎస్ ఎస్ తో తమ సంబంధాలను దాచుకోలేదు. మోదీతో గల సంబంధాలు, దేశ సమస్యలు, సంక్లిష్టతలరీత్యా ఆర్.ఎస్.ఎస్.ఆయన పట్ల మృదువుగా వ్యవహరిస్తూంటుందని బిజెపి వర్గాలు భావిస్తూంటాయి. అన్నిటికీ మించి మౌలికమైన ఎజెండా విషయంలోనూ, కీలకమైన పరిణామాల్లోనే తప్ప దైనందిన ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆర్.ఎస్.ఎస్. జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు.

మొదటిసారి పెద్ద మెజారిటీలో స్వయంగా ‘స్వయం సేవకుడు’ అయిన మోదీ కేంద్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పిన 15 నెలలకు బిజెపి అర్.ఎస్.ఎస్.ల సమన్వయ సమావేశం మూడు రోజులపాటు ప్రతీ అంశాన్నీ పర్యవసానాన్నీ చర్చించింది. దినపత్రికల ఢిల్లీ ఎడిషన్లు అనేక కథనాలను ప్రచురించాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులకు గేట్లు తెరిచేసిందన్న విమర్శలు వస్తే, మోదీ ప్రభుత్వం అసలు గేట్లే లేకుండా చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణం ఆర్.ఎస్.ఎస్. ప్రధానఅంశం. మెజారిటీ వున్నప్పటికీ మతపరమైన సెంటిమెంట్లు రాజకీయ అనివార్యతలు, అవసరాల కారణంగా ఇప్పటికిప్పుడే రామాలయ నిర్మాణం సాధ్యపడదని అందుకు వ్యవధి అవసరమనీ సమావేశం అవగాహనకు వచ్చినట్టు సమాచారం.

మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ కోసం విదేశీ భారీపెట్టుబడులు భారీగా వస్తున్న పరిస్ధితి భారతీయతకు హాని చేయకూడదని గట్టిగా చెప్పారని, ఇందుకు వీలుగా గ్రోత్ ఇంజన్ల మోడళ్ళు లో ఇండియా వుండాలని ప్రభుత్వానికి సూచించారని చెబుతున్నారు. మోహన్ భగత్, నరేంద్రమోదీల సమావేశం ముగిశాక మీడియాకు దత్తాత్రేయ హోసబలే చెప్పిన మాటలు ఈ సమాచారాన్ని దృవపరుస్తున్నాయి.

15 నెలల మోదీ పాలన తర్వాత జరిపిన సమీక్ష ఫలితంగా భారతీయ నమూనా ప్రకారమే దేశాభివృద్ధి జరగడానికి ఆర్ఎస్ఎస్ మొదటి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టమైపోయింది. అలాగే, విదేశీపెట్టుబడులపై మోదీని అపుడపుడూ బహిరంగంగా విమర్శిస్తున్న స్వదేశీ జాగరణ్ మంచ్ ఇకపై ఎన్ డిఎ ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించదు. ఇందులో భారతీయ నమూనా పై నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తుంది. ఇదికూడా సమన్వయ సమావేశం పర్యావసానమే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close