నాయ‌కుడిగా స‌చిన్ స్కోర్ ఏం బాలేదు..

సెలిబ్రిటీలు ప‌ద‌వుల్లో రాణించ‌గ‌ల‌రా… ఈ చ‌ర్చ మ‌రోసారి తెర‌మీదికి తెచ్చిన సంద‌ర్భం ఇది! మ‌న‌దేశంలో క్రికెట‌ర్లు, సినీతార‌లు ఎంతోమంది ఆరాధ్యులు. వీరికి కోట్ల మంది అభిమానులు ఉంటారు. వారి జీవితాల‌నే ఆద‌ర్శంగా తీసుకునేవారూ ఉన్నారు! అయితే, ఇలాంటి వారి పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డం అనేది మ‌నం ఎప్ప‌ట్నుంచో చూస్తూనే ఉన్నాం. అయితే, ప‌ద‌వులు ఇవ్వ‌డం త‌ప్పుకాదుగానీ… ఆ ప‌ద‌వులు పొందాక వీరు అందిస్తున్న సేవ‌లూ, ప‌ద‌వికి ఇస్తున్న గౌర‌వం, చిత్త‌శుద్ధీ ఏపాటిది అనేది ముఖ్యం. రాజ్య‌స‌భ‌కు రాష్ట్రప‌తి నామినేట్ చేసిన క్రికెట‌ర్ సచిన్ టెండూల్క‌ర్‌, ప్ర‌ముఖ తార రేఖల గురించి ఇప్పుడీ చ‌ర్చ మొద‌లైంది!

పార్ల‌మెంటుకు సచిన్ వ‌చ్చిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. ప్ర‌శ్న‌లు వేసే సంద‌ర్భాలు ఇంకా త‌క్కువ‌. కోటా ప్ర‌కారం వ‌చ్చిన నిధుల‌ను ప్ర‌జల కోసం ఖ‌ర్చు చేయ‌డం మ‌రీ త‌క్కువ‌! పార్ల‌మెంటు స‌భ్యులు హాజ‌రు, నిధుల ఖ‌ర్చుల‌కు సంబంధించి జాబితాను తాజాగా విడుద‌ల చేశారు. దీని ప్ర‌కారం 348 రోజుల్లో స‌చిన్ స‌భ‌కు హాజ‌రైంది కేవ‌లం 23 రోజులు మాత్ర‌మే. మిగ‌తా రోజుల‌న్నీ గైర్హాజ‌రే. న‌టి రేఖా హాజ‌రీ అయితే గెస్ట్ ఎప్పీరియ‌న్స్ మాత్ర‌మే. కేవ‌లం 18 రోజులే స‌భ‌కు వ‌చ్చారు. స‌భ‌లో అతిత‌క్కువ హాజ‌రు న‌మోదు చేసుకున్న‌వారు ఈ ఇద్ద‌రే.

ఇక్క‌డో ట్విస్ట్ ఏంటంటే… స‌భ‌కు రావ‌డం త‌క్కువైనా, ఖ‌ర్చు విష‌యంలో రేఖ ఏమాత్రం త‌గ్గ‌క‌పోవ‌డం. ఇప్ప‌టి వ‌ర‌కూ రేఖ కోసం జ‌రిగిన ఖ‌ర్చు రూ. 65 ల‌క్ష‌లు కావ‌డం విశేషం. స‌చిన్ కోసం రూ. 58.8 ల‌క్ష‌లు కావ‌డం ఇంకో విశేషం! ఇక‌, ఎంపీ లాడ్స్ నిధుల వినియోగం విష‌యానికొస్తే… స‌చిన్ ఏకంగా రూ. 21.19 కోట్ల విలువైన ప‌నుల్ని ప్ర‌తిపాదించాడు. వాటిలో రూ. 17.65 కోట్ల నిధులు విడుద‌ల అయ్యాయి. రేఖాజీ అయితే కేవ‌లం రూ. 9.28 కోట్ల నిధుల‌ను మాత్ర‌మే విడుద‌ల చేయించుకున్నారు.

సో.. రాష్ట్రప‌తి ద్వారా నామినేట్ అయిన ఈ తార‌ల ప‌నితీరు ఇలా ఉంద‌న్న‌మాట‌! నిజానికి, మిగ‌తావారికి వీరే ఆద‌ర్శంగా నిల‌వాలి. ఈ సెలెబ్రిటీల ప‌నితీరును ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తారు. కాబ‌ట్టి, మ‌రింత బాధ్య‌తాయుతంగా ఉండాలి. కానీ, ఎంపీగా స‌చిన్ విధి నిర్వ‌హ‌ణ ఇలా ఉంద‌న్న‌మాట‌! ఏదేమైనా, సెలెబ్రిటీల‌కు ఇలాంటి హోదాలు క‌ట్ట‌బెట్టే ముందు తీవ్రంగా ఆలోచించాల‌నే చ‌ర్చ మ‌ళ్లీ మొద‌లైంది. వివిధ రంగాల‌కు చెందిన‌వారికి స‌భ‌లో ప్రాతినిధ్యం ఇవ్వ‌డం త‌ప్పు అని ఎవ్వ‌రూ అన‌రు. కానీ, ఎంపీలుగా బాధ్య‌త‌లు స్వీక‌రించాక‌… ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా ఉంటార‌నే న‌మ్మ‌కం ఉన్న‌వారికే ఇలాంటి ప‌ద‌వులు ఇస్తే బాగుంటుంది క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close