చిరు టైటిల్‌ని వాడేస్తున్న సాయిధ‌ర‌మ్‌

తొలి సినిమాకే మావ‌య్య పాట‌ని రీమిక్స్ చేసి – మెగా అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేశాడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, సుప్రీమ్ సినిమాల్లో ఈ ఆన‌వాయితీ పాటించాడు. ఆ రెండు సినిమాలూ హిట్ అయ్యాయి. ఇప్పుడు టైటిళ్ల‌పై ప‌డ్డాడు. చిరంజీవి న‌టించిన ‘మ‌హాన‌గ‌రంలో మాయ‌గాడు’ సినిమా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ టైటిల్‌ని వాడుకొనే ప‌నిలో ప‌డ్డాడు సాయిధ‌ర‌మ్ తేజ్‌. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ఓ సినిమా రూపుదిద్దుకొనేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. క‌థ రెడీ అయిపోయింద‌ట‌. ఈ చిత్రానికి ‘మ‌హాన‌గరంలో మాయ‌గాడు’ అనే టైటిల్ ఫిక్స్ చేయాల‌ని మారుతి భావిస్తున్నాడు. మావ‌య్య సినిమా టైటిల్ అంటే సాయిధ‌ర‌మ్ ఎలాగూ కాద‌న‌లేడు. పైగా మెగా ఫ్యాన్స్‌ని ఆక‌ర్షించిన‌ట్ట‌వుతుంది. అందుకే.. మారుతి దృష్టి ఈ టైటిల్ పై ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం జ‌వాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు సాయి. ఆ త‌ర‌వాత వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నాడు. ఈ రెండు సినిమాలూ పూర్త‌య్యాకే మారుతి సినిమా ప‌ట్టాలెక్కుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close