స‌మంత‌… టాలీవుడ్ లేడీ సూప‌ర్ స్టార్!

సూప‌ర్ స్టార్‌. ఈ బిరుదు ఓ హీరోయిన్‌కి ఇవ్వ‌డం క‌ష్ట‌మే. అరుదైన విష‌యం కూడా.
అందుకు ఎంత స్టామినా ఉండాలో?
అటు గ్లామ‌ర్ రోల్స్ చేయ‌గ‌ల‌గాలి. ఇటు సోలోగా క‌థ‌ల్ని న‌డిపించేయాలి. త‌న పోస్ట‌రు చూసి.. జ‌నాలు థియేట‌ర్ ముందు క్యూ క‌ట్టాలి?
ఇప్పుడు ఎవ‌రికి ఉంది ఆ స్టామినా? ఇది వ‌ర‌కు విజ‌య‌శాంతి కి ఇలానే హార‌తులు ప‌ట్టారు జన‌మంతా. ఆ త‌ర‌వాత‌.. అనుష్క ఆ హోదా సాధించ‌గ‌లిగింది. ఇప్పుడు.. ఈ జ‌న‌రేష‌న్‌లో `స‌మంత‌` త‌ప్ప మ‌రో పేరు క‌నిపించ‌డం లేదు, వినిపించ‌డం లేదు.

అదృష్ట‌మంటే స‌మంత‌దే. ఈ విష‌యాన్ని స‌మంత చాలా సంద‌ర్భాల్లో ఒప్పుకుంది కూడా. `అదృష్టం, ప్ర‌తిభ స‌మాన స్థాయిలో ఉండాలి. నాకు ప్ర‌తిభ కంటే పిస‌రంత ఎక్కువ‌గా అదృష్టం ఉంది..` అంటుంటుంది. ఇది వ‌ర‌కైతే ఈ మాట‌లు నిజం అనుకునేవాళ్ల‌మే. కానీ… `రంగ‌స్థ‌లం`, `ఓ బేబీ` లాంటి సినిమాలు చూశాక‌, అందులో న‌టిగా స‌మంత విజృంభ‌ణ గ‌మ‌నించాక‌.. ప్ర‌తిభే పిస‌రంత ఎక్కువుంది అని చెప్పాల‌నిపిస్తుంటుంది.

ఏం మాయ చేసావెలో జెస్సీగా స‌మంత‌ని చూసిన‌ప్పుడే తెలుగు ప్రేక్ష‌కులు ఫిక్స‌యిపోయారు. ఈ అమ్మాయి ఇంకొన్నాళ్లు చిత్ర‌సీమ‌ని ఏల‌డం ఖాయ‌మ‌ని. అంతకంటే ప‌ర్‌ఫెక్ట్ ఎంట్రీ ఎవ‌రికి దొరుకుతుంది. ఆ విష‌యంలో స‌మంత అదృష్ట‌వంతురాలే. ఆ వెంట‌నే స్టార్ హీరోల స‌ర‌స‌న ఛాన్సులు అందుకుంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలకు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచింది. ఎటు చూసినా, ఏ సినిమాకెళ్లినా స‌మంతే క‌నిపించింది. ఓ ద‌శ‌లో స‌మంత‌ని చూసీ చూసీ జ‌నాల‌కూ బోర్ కొట్టేసింది. రొటీన్ పాత్ర‌లు చేస్తూ విసిగించింది. ఆ త‌ర‌వాత స‌మంత చుట్టూ బోలెడ‌న్ని ప్రేమ‌క‌థ‌లు. పుకార్లు. ఈలోగా కొత్త‌మ్మాయిల రాక‌తో స‌మంత చాప్ట‌ర్ క్లోజ్ అనుకునే స్థాయికి వెళ్లింది.

ఎంత త్వ‌ర‌గా లేచిందో.. అంతే త్వ‌ర‌గా ప‌డింది. ప‌డిపోయిందా.. అనుకునే లోగా మ‌ళ్లీ కెర‌ట‌మై లేచింది. త‌న‌లోని న‌టిని బ‌య‌ట‌పెట్టుకునే ప్ర‌తీ అవ‌కాశాన్నీ ఒడిసిప‌ట్టుకుంది. యూట‌ర్న్‌, మ‌హాన‌టి, రంగ‌స్థ‌లం, ఓ బేబీ, మ‌జిలీ.. ఇలా తిరుగులేని విజ‌యాల్ని అందుకుంది. ఆయా చిత్రాల్లో స‌మంత పాత్ర‌లు గుర్తుండిపోయాయి. ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో ముద్రించుకుపోయాయి. సూప‌ర్ డీల‌క్స్ లాంటి సాహ‌సోపేత‌మైన పాత్ర‌లు స‌మంత ఖాతాలో ఉన్నాయి. `ఇలాంటి సినిమాలు నేను చేశా` అని ఇప్పుడు స‌మంత స‌గ‌ర్వంగా చెప్పుకోగ‌ల‌దు. అటు వ్య‌క్తిగ‌త జీవితంలోనూ స‌మంత సూప‌ర్ హిట్. ప్రేమించి పెళ్లి చేసుకుంది. అక్కినేని కోడ‌లు హోదా తెచ్చుకుంది. ప్రేమించే భ‌ర్త‌, సుల‌క్ష‌ణ‌మైన కెరీర్‌, తిరుగులేని స్టార్ డ‌మ్.. ఇంకేం కావాలి? ఇప్పుడు స‌మంత‌ని చూసి జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. స‌మంత ని దృష్టిలో ఉంచుకుని కొత్త క‌థ‌లు అల్లుకుంటున్నారు ద‌ర్శ‌కులు. ఇంకేం సాధించాలి?

తెలుగు సినిమాల్లో లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌ల‌కు స‌మంత ఇప్పుడు పెద్ద దిక్కు.
సాహ‌సోపేత‌మైన పాత్ర‌లు చేయాలంటే స‌మంత‌నే దిక్కు.
స‌మంతని సూప‌ర్ స్టార్ అన‌కుండా ఎలా ఉంటాం? కిప్ ఇట్ అప్ స‌మంత‌.. నీ దూకుడు ఇలానే సాగిపోవాలి. రాబోయే త‌రం కూడా నీ మాయ‌లో ప‌డిపోవాలి. ఆల్ ది బెస్ట్‌ !!

హ్యాపీ బర్త్ డే సమంత !

(ఈరోజు స‌మంత పుట్టిన రోజు సంద‌ర్భంగా)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close