సొంత భాషలో సమంత ఎందుకు హ్యాండ్ ఇచ్చిందో?

సమంతకు తమిళనాడు, తమిళ సినిమా ఇండస్ట్రీ పుట్టినిల్లు అయితే తెలుగు రాష్ట్రాలు, తెలుగు సినిమా ఇండస్ట్రీ అత్తారిల్లు. మాతృభాష తమిళ్ కన్నా తెలుగులో ఈ చెన్నై సుందరికి ఎక్కువమంది అభిమానులు వున్నారు. తనకు ఎంతో ఆదరణ, ఆప్యాయత రావడానికి కారణమైన అత్తారింటి భాష తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తుంటుందీ సుందరి. అయితే… ‘మహానటి’ ముందు వరకూ ఒక్క సినిమాలో కూడా సమంత డబ్బింగ్ చెప్పుకోలేదు. ఎక్కువశాతం సినిమాల్లో ఆమెకు గాయని చిన్మయి డబ్బింగ్ చెప్పారు. సావిత్రి బయోపిక్‌కి స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. అదీ తెలుగులో మాత్రమే. సొంత భాష తమిళంలో ఎందుకనో డబ్బింగ్ చెప్పుకోలేదు. ఆమె పాత్రకు ‘రంగస్థలం’లో ‘రంగమ్మా మంగమ్మా’ పాట పాడిన ఎంఎం మానసి డబ్బింగ్ చెప్పారు. ‘మహానటి’ని తమిళనాట ‘నడిగైయర్‌ తిలగం’ పేరు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘జెమినీ’ గణేశన్ కుమార్తె అభ్యంతరాలు మినహా అక్కడ వివాదాలు ఏమీ లేవు. సినిమా బ్రహ్మాండంగా ఆడుతోంది. మానసి డబ్బింగ్‌కి ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో సమంతకు పేరు తెచ్చిన పతాక సన్నివేశాలు తమిళ ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. ఆ సన్నివేశాల్లో మానసి డబ్బింగ్ చెప్పిన తీరుని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. తెలుగు కంటే తమిళంలో మాట్లాడడమే సమంతకు సులభం. మరి, మాతృభాషలో డబ్బింగ్ చెప్పుకోకుండా ఎందుకు హ్యాండ్ ఇచ్చారో మరి?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close