మ‌హేష్ స‌మంత‌ని చంపేస్తాడ‌ట‌..

బ్ర‌హ్మోత్స‌వం ఆడియో ఫంక్ష‌న్లో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది మ‌హేష్‌బాబు త‌న‌య సితార‌. మ‌హేష్ కూడా ‘ఈ ఆడియో ఫంక్ష‌న్‌ని మా పాప సితార వ‌చ్చింది.. అంతా మంచే జ‌రుగుతుంది’ అంటూ సెంటిమెంట్ డైలాగు వ‌దిలాడు. స‌మంత అయితే.. సితార‌తో ఎన్ని క‌బుర్లు చెప్పిందో?? సితార‌తో కాసేపు మాట్లాడిందో లేదో.. ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్ అయిపోయార‌ట‌. ఈ విష‌యాన్ని స‌మంత‌నే చెప్పింది. అంతేకాదు.. గౌత‌మ్ కంటే సితార చాలా యాక్టివ్‌గాఉంద‌ని, గౌత‌మ్ హీరో అవుతాడో లేదో తెలీదుగానీ సితార మాత్రం పెద్ద హీరోయిన్ అయిపోవ‌డం ఖాయ‌మ‌ని జోస్యం చెప్పింది.

”సితార చాలా యాక్టివ్‌గా ఉంది. త‌న స్మైల్‌, డాన్స్ చూసి మెస్మ‌రైజ్ అయిపోయా. ఇద్ద‌రం స్నేహితులు అయిపోయాం. ఈ మాట వింటే… మ‌హేష్ న‌న్ను కిల్ చేస్తారేమో..” అంటూ తెగ ఇదైపోతుంది స‌మంత‌. ఇది ఆమె మాటే కాదు.. సితార‌ని చూసినోళ్లంతా అదే అంటున్నారు. సితార కాబోయే హీరోయిన్ అంటూ డిక్లేర్ చేస్తున్నారు. మ‌రి మ‌హేష్ ఏమంటాడో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close