మ‌హేష్ బాబుకి పోటీగా సంపూ కూడా…

మ‌హేష్ అభిమానుల‌కు ఇది అదిరిపోయే వార్త‌! మురుగ‌దాస్ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ కోసం ఎన్నాళ్ల నుంచో మ‌హేష్ ఫ్యాన్స్ క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇదిగో.. అదిగో అనుకొంటున్నారు గానీ, మ‌హేష్ నుంచి ఒక్క లుక్ కూడా బ‌య‌ట‌కు రాలేదు. ఈలోగా చాలా పండ‌గ‌లూ వెళ్లిపోయాయి. ఇప్పుడు మ‌హేష్ అభిమానుల నిరీక్ష‌ణ ఫలించ‌బోతోంది. మ‌హేష్ -మురుగ‌దాస్‌ల ఫ‌స్ట్ లుక్ రాబోతోంది. ఈనెల 12 వ తేదీ సాయింత్రం 5 గంట‌ల‌కు ఫ‌స్ట్ లుక్ ని చూపించ‌డానికి చిత్ర‌బృందం స‌మాయాత్తం అయ్యింది. అభిమానుల అంచ‌నాలు, వాళ్ల ఎదురుచూపుల‌కు త‌గ్గ‌ట్టుగా ఫ‌స్ట్ లుక్‌కి క్రియేటీవ్ గా డిజైన్ చేశాడ‌ట మురుగ‌దాస్‌. ఇక‌.. ప్రిన్స్ ఫ్యాన్స్‌కి పండ‌గే.

అన్న‌ట్టు స‌రిగ్గా అదే రోజు.. అదే స‌మ‌యానికి సంపూర్నేష్ బాబు మ‌హేష్‌కి పోటీగా దిగిపోతున్నాడు. త‌న తాజా చిత్రం ‘కొబ్బ‌రి మ‌ట్ట‌’కు సంబంధించిన ఓ పాట‌ని 12వ తేదీ, 5 గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్నాడు. సంపూకి సోష‌ల్ మీడియాలో అభిమానుల‌కు కొర‌త లేదు. ‘కొబ్బ‌రి మ‌ట్ట‌’ టీజ‌ర్‌కి వ‌చ్చిన వ్యూసే అందుకు సాక్ష్యం. మ‌హేష్ ఫ‌స్ట్ లుక్ హ‌డావుడిలోనే.. త‌న టీజ‌ర్‌పైనా ఓ లుక్ వేస్తార‌ని సంపూ న‌మ్ముతున్నాడు. అందుకే స‌రిగ్గా అదే స‌మ‌యానికి త‌న పాట‌ని విడుద‌ల చేస్తున్నాడ‌న్న‌మాట‌. సాధార‌ణంగా పెద్ద హీరోల‌కు సంబంధించిన టీజ‌ర్లు, ఫ‌స్ట్ లుక్‌లు వ‌చ్చిన‌ప్పుడు మిగిలిన సినిమాలు, మిగిలిన స్టార్లూ… కాస్త వెన‌క‌డుగు వేస్తారు. కానీ సంపూ మాత్రం ధైర్యంగా త‌న టీజ‌ర్‌ని రెడీ చేస్తున్నాడు. ఎంతైనా సంపూ సంపూనే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close