ఈ నెల 30న ఆడియో దీపావళికి నిఖిల్ ‘శంకరాభరణం’ విడుదల

స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య.. ఇలా వరుసగా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ, ముందుకు దూసుకెళుతున్న నిఖిల్ నటించిన తాజా చిత్రం ‘శంకరాభరణం’. నందిత కథానాయికగా నటించింది. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వీ.వీ. సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. ‘గీతాంజలి’ వంటి విజయం తర్వాత ఎంవీవీ సినిమా సంస్థ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

ఈ నెల 30న ఆడియోను, దీపావళికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ- ”ఇటీవల పవన్ కల్యాణ్ గారు విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రకథ గురించి చెప్పాలంటే.. యూఎస్ కి చెందిన అత్యంత సంపన్నుడి కొడుకు హీరో నిఖిల్. ఈ ప్రపంచంలో సుఖపడేవాళ్లు, కష్టపడి పనిచేసేవాళ్లు.. ఈ రెండు జాతులే ఉంటాయన్నది హీరో నమ్మకం. తాను సుఖపడటానికే పుట్టానన్నది అతని ఫీలింగ్. అలాంటి అతను ఓ పని మీద ఇండియా వచ్చి, అనుకోకుండా కష్టాల్లో చిక్కుకుంటాడు. వాటి నుంచి ఎలా తప్పించుకున్నాడనే కథాంశంతో సినిమా సాగుతుంది. ఇందులో అంజలి స్పెషల్ క్యారెక్టర్ చేసింది. సుమన్, సితార, రావు రమేశ్, సప్తగిరి.. ఇలా మొత్తం 40 మంది ప్రముఖ నటీనటులు నటించారు. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించాం. హారర్ కి కామెడీ మిక్స్ చేసి, మేం తీసిన ‘గీతాంజలి’ ఘనవిజయం సాధించింది. ఇప్పడు క్రైమ్ లో కామెడీ మిక్స్ చేసి ‘శంకరాభరణం’ చేశాం. ఇంతకుముందు క్రైమ్ కామెడీ సినిమాలు చాలా వచ్చాయి కానీ ఇది చాలా డిఫరెంట్. ఈ సినిమాలో సెట్స్ ఉపయోగించలేదు. టాకీ మాత్రమే కాదు… చివరికి పాటలను కూడా సహజమైన లొకేషన్స్ లోనే తీశాం. బీహార్ లోని డేంజరస్ లొకేషన్స్ లో, పుణేకి దగ్గరలో ఎవరూ చేయని లొకేషన్స్ లో, యూఎస్ లో కొంత భాగం చిత్రీకరించాం. ఇందులో ఆరు పాటలు ఉన్నాయి. ప్రవీణ్ లక్కరాజ మంచి స్వరాలందించారు. ఈ నెల 30న పాటలను విడుదల చేయబోతున్నాం. దీపావళికి సినిమాని విడుదల చేస్తాం” అని చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ- ”మా సంస్థ నుంచి వచ్చిన ‘గీతాంజలి’ ఘనవిజయం సాధించింది. మలి చిత్రం కూడా అలానే ఉండాలని తొమ్మిది నెలలు వెయిట్ చేసి, ఈ చిత్రకథను ఎంపిక చేశాం. కోన వెంకట్ మంచి కథ ఇచ్చారు. ఆ కథను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. కథ డిమాండ్ చేసిన మేరకు రాజీపడకుండా భారీ బడ్జెట్ తో నిర్మించాం’ అని చెప్పారు.

రావు రమేశ్, సత్యం రాజేశ్, షకలక శంకర్, సుజయ్ మిశ్రా, పిటూబాష్ త్రిపాఠి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఎడిటింగ్: చోటాకె. ప్రసాద్, రచనా సహకారం: వెంకటేశ్ కిలారు, భవాని ప్రసాద్, డ్యాన్స్ మాస్టర్స్: శేఖర్-శివ, ఫైట్ మాస్టర్: విజయ్, మేనేజర్స్: నాగు-రవి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహ నిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు: కోన వెంకట్, దర్శకత్వం: ఉదయ్ నందనవనమ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com