తెలంగాణలో సీన్ రివర్స్

ఒక్క దెబ్బకు సీన్ మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులను ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నిజానికి, ఓటుకు నోటు కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డిని ఓ ఆట ఆడుకోవాలని కొందరు తెరాస సభ్యులు భావించినట్టు తెలుస్తోంది. మీడియా ప్రతినిధులతో ఆఫ్ ది రికార్డుగా కొందరు నేతలు చెప్పిన మాటలివి. మొన్నటి వరకూ రేవంత్ సభకు రాలేదు. సోదరుడి మరణం కారణంగా ఆయన ఇన్ని రోజులూ సభకు దూరంగా ఉన్నారు. సోమవారం సభకు వచ్చిన రేవంత్ రెడ్డిని తెరాస సభ్యులు ఏమేరకు ఇరుకున పెడతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే, రైతుల సమస్య, రుణమాఫీ అంశంతో రేవంత్ వ్యవహారం వెనక్కి వెళ్లింది. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద పెద్ద ఎత్తున నినాదాలతో నిరసన తెలపడంతో అధికార పక్షం చికాకు పడింది. కేసీఆర్ కు కోపం వచ్చింది. రెండు రోజులు సుదీర్ఘంగా చర్చించిన అంశంపై మళ్లీ విపక్షం పట్టుబట్టడంతో సహజంగానే ముఖ్యమంత్రికి విసుగనిపించింది.

విపక్ష సభ్యులు ఎంతకూ మాట వినకపోవడంతో సస్పెన్షన్ అస్త్రాన్ని బయటకు తీశారు హరీష్ రావు. అంతే, జరగాల్సింది జరిగిపోయింది. రుణమాఫీ ఒకేసారి చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ చర్యను ఫోకస్ చేయడం ద్వారా, ప్రభుత్వం రైతు వ్యతిరేకి అనే ముద్ర వేయడానికి ప్రతిపక్షాల చేతికి అస్త్రాన్ని ఇచ్చినట్టయింది. ఒకేసారి రుణమాఫీ డిమాండ్ పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ ఊరూవాడా ప్రచారం చేయడానికి ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. అంతటితో ఆగకుండా ఈనెల 10న తెలంగాణ బంద్ జరపాలని కూడా నిర్ణయించారు. ఒక్క దెబ్బతో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి, తెరాస మిత్ర పక్షం మజ్లిస్ మినహా.

అధికార పార్టీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తారని పేరున్న సీఎల్పీ నాయకుడు జానారెడ్డి కూడా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఇన్ని ప్రతిపక్షాలు ఒక అంశంపై కలిసికట్టుగా ఈ స్థాయిలో పోరాడటం ఇటీవలి కాలంలో అరుదైన విషయం. అందులోనూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టులు కలిసి రావడం మామూలు విషయం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందున్న ఆప్షన్లు రెండు. ఒకటి, ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్టు ఒకేసారి రుణమాఫీకి ఒప్పుకోవడం. రెండు, ప్రతిపక్షాల డిమాండ్ ను పట్టించుకోక పోవడం. రెండో పని చేస్తే రైతుల దృష్టిలో చెడ్డపేరు రావచ్చు. మొదటి పని చేసినా, క్రెడిట్ విపక్షాల ఖాతాలోకి పోవచ్చు. మరి ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close