“ఇంగ్లిష్ మీడియం”లోనూ సుప్రీంలో ఏపీ సర్కార్‌కు నిరాశే..!

నిర్బంధ ఇంగ్లిష్ మీడియం విషయంలో పట్టుదలకు పోయిన ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలిదింది. ఈ మేరకు ఏపీ సర్కార్ జారీ చేసిన జీవోలను కొట్టి వేస్తూ..ఏపీ హైకోర్టు తీసుకున్న నిర్ణయాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ… ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల ఇరవై ఐదో తేదీకి వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లిష్ మీడియాన్ని నిర్బంధం చేయాలని.. తెలుగు మీడియంను రద్దు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలో జీవోలు విడుదల చేసింది.అయితే.. ఆ జీవోలు రాజ్యాంగంలోని ప్రాధమిక విద్య హక్కులకు.. విద్యా హక్కు చట్టం ప్రకారం.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల హక్కులకు భంగం కలిగించేలా ఉందని చెబుతూ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు… ప్రభుత్వ జీవోలను కొట్టి వేసింది. అయితే.. ఈ విషయంలో ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండాలన్న లక్ష్యంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పు ప్రకారం.. ఏ మీడియం అనేది.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఇష్టం కావడంతో.. ఆ మేరకు.. తల్లిదండ్రుల వద్ద నుంచి వాలంటీర్ల ద్వారా అఫిడవిట్లు సేకరించారు. ఆ అఫిడవిట్ల ఆధారంగా.. 80 శాతానికిపైగా తల్లిదండ్రులు.. ఇంగ్లిష్ మీడియం కోరుతున్నారని చెబుతూ.. హైకోర్టు తీర్పును.. సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

ప్రపంచంలో ఏ దేశం కూడా మాతృభాషను పూర్తిగా రద్దు చేసి.. ఇంగ్లిష్ మీడియంను పెట్టాలన్న ఆలోచన చేయలేదు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని.. విద్యాహక్కు చట్టం చెబుతోంది. అయితే.. వీటన్నింటినీ.. ఏపీ సర్కార్ పరిగణనలోకి తీసుకోలేదు. చట్టాలు.. రాజ్యాంగాలను లెక్కలోకి తీసుకోకుండా జీవోలిచ్చింది. న్యాయపరమైన అడ్డంకులు వచ్చిన తర్వాత రాజకీయ పరమైన ఎదురుదాడి చేసింది. తెలుగు మీడియం అని డిమాండ్ చేస్తున్న వారి పిల్లలు.. ఏ మీడియంలో చదువుతున్నారని వైసీపీ నేతలు… ప్రశ్నించడం ప్రారంభించారు. చివరికి వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close