రిస్క్‌లో షర్మిల రాజకీయ జీవితం!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రాజకీయ జీవితం రిస్క్‌లో పడిపోయింది. ఆమెను చేర్చుకునేందుకు..పార్టీని విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపించడం లేదు. అలాంటి ఆలోచనే ఉంటే.. తుమ్మల నాగేశ్వరరావు కు కండువా కప్పి ఆమెను వెయిటింగ్‌లో ఉంచేవారు కాదు. షర్మిల చేరికను తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా వ్యతిరేకిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు సమర్థిస్తున్నా … ఆయనకే ప్రాధాన్యం దక్కడం లేదు.

ఇప్పుడు షర్మిల పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేదు. కాంగ్రెస్ లో విలీనం చేసి ఓ టిక్కెట్ వస్తే పాలేరు నుంచి గెలిచేస్తానని ఆశలు పెట్టుకుని సొంత పార్టీ వ్యవహారాల్ని నిలిపివేశారు. ఇప్పుడు కాంగ్రెస్ టిక్కెట్ ఠికాణా లేదు. చేర్చుకుంటారన్న గ్యారంటీ లేదు. కనీసం ఏపీ పగ్గాలివ్వడానికి కూడా సిద్ధపడటం లేదు. అక్కడ జగన్ రెడ్డితో ఇప్పటికే లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఆమె పోటీ చేస్తే.. పాలేరులో మూడు శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. నిజంగా ఇలాంటి పరిస్థితే ఉంటే.. ఆమె పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం తప్ప మోర ప్రశ్న ఉండదు.

అంతకు మించి తెలంగాణ లో కనీస ప్రభావం చూపించలేకపోతే ఏపీలో రాజకీయాలు చేయాలన్న ప్రజలు ఆహ్వానించరు. అక్కడ పట్టించుకోకపోతే ఏపీకి వచ్చారన్న విమర్శలు ఎదుర్కొంటారు. ఇప్పుడు షర్మిల కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ లో చేరి.. సైలెంట్ గా ఉండటమా.. మొండిగా ముందుకెళ్లడమా అన్నది కీలకం. కాంగ్రెస్ లో చేరాలంటే.. తెలంగాణ ఎన్నికల తర్వాతే వారు ఆహ్వానించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close