శ్ర‌ద్దాదాస్ ‘బిగ్‌’ వార్నింగ్‌

బిగ్ బాస్ 4లో శ్ర‌ద్ధాదాస్ ఉన్న‌ట్టు ముందు నుంచీ వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ ప్ర‌స్తావ‌న ఎప్పుడు వ‌చ్చినా – శ్ర‌ద్ధాదాస్ గురించే మాట్లాడుకున్నారు. అయితే… ఈ సీజ‌న్ లో తాను లేన‌ని, అస‌లు బిగ్ బాస్ లో పాల్గొవాల‌న్న ఆలోచ‌న త‌న‌కు రాలేద‌ని చెప్పేసింది శ్ర‌ద్ధా. త‌న‌ని బిగ్ బాస్ షోలో పాల్గొన‌మ‌ని ఎవరూ సంప్ర‌దించ‌లేద‌ని, ఇవ‌న్నీ పుకార్లేన‌ని కొట్టి పారేసింది. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు చూసి ఓపిక ప‌ట్టాన‌ని, ఇక స‌హించేది లేద‌ని, ఇదే మొద‌టి, చివ‌రి హెచ్చ‌రిక అంటూ వార్నింగ్ ఇచ్చింది. త‌న గురించి ఎవ‌రైనా, ఏమైనా రాయాల‌నుకుంటే ముందు త‌న‌ని సంప్ర‌దించాల‌ని, తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటాన‌ని చెప్పుకొచ్చింది. త‌రుణ్ పై కూడా ఇలాంటి వార్త‌లే వ‌చ్చాయి. త‌రుణ్ ఈ సీజ‌న్ లో క‌నిపిస్తాడ‌ని చెప్పుకున్నారు. కానీ త‌రుణ్ కూడా ఈ షోలో పాల్గొన‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చాడు. జాబితాలో 16 మంది సెల‌బ్రెటీల పేర్లు వినిపిస్తున్నా, వాళ్లెవ‌రూ ఖాయం కాదు. బిగ్ బాస్ యాజ‌మాన్యం ప్ర‌క‌టించే వ‌ర‌కూ.. ఎవ‌రెవ‌రు ఈ షోలో పాల్గొంటారో చెప్ప‌డం క‌ష్ట‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close