శివాజీ రాజా.. రాజీనామాస్త్రం?

ఇటీవ‌ల చిత్ర‌సీమ‌ని చుట్టిముట్టిన వివాదాల‌లో ప‌రోక్షంగా `మా` వైఫ‌ల్యం కూడా ఉంది. శ్రీ‌రెడ్డి పై నిరంకుశ‌త్వ ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే ఈ వ్య‌వ‌హారం బాగా ముదిరిపోయింద‌ని ఇండ్ర‌స్ట్రీ పెద్ద‌లు సైతం బ‌హిరంగంగానే చెప్పారు. విష్ణు అయితే..`మా` వైఖ‌రి ఎండ‌గ‌డుతూ ఓ లేఖ రాశాడు. అందులో ‘మా’ వైఫ‌ల్యాల‌ను ఎత్తి చూపించాడు. వీట‌న్నింటికీ బాధ్య‌త వ‌హిస్తూ ‘మా’అధ్య‌క్షుడు శివాజీ రాజా రాజీనామా చేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇండ్ర‌స్ట్రీ పెద్ద‌ల‌తోనూ ఆయ‌న చూచాయిగా చ‌ర్చించార‌ని తెలుస్తోంది. ఈరోజు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫిల్మ్ ఛాంబ‌ర్‌లోకాస్త హ‌డావుడి చేయ‌డంతో – ఈ సీన్ మొత్తం ప‌క్క‌కు వెళ్లిపోయింద‌ని స‌మాచారం. ఒక‌ట్రెండు రోజుల్లో శివాజీ రాజా నుంచి ఇలాంటి ప్ర‌క‌ట‌నేదో వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. శ్రీ‌రెడ్డి వివాదాన్ని ప‌క్క‌న పెడితే… శివాజీ రాజా `మా` విష‌యంలో చాలా పాటు ప‌డ్డాడు. `మా` సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల్ని ఘ‌నంగా చేయాలని తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. ఇది వ‌ర‌క‌టి `మా` కంటే.. శివాజీ రాజా అన్ని విష‌యాల్లోనూ మెరుగే. అలాంటి శివాజీరాజాని చిత్ర‌సీమ ఎందుకు వ‌దులుకుంటుంది? అందుకే రాజీనామా చేస్తాన‌న్నా… ఆయ‌న్ని బుజ్జ‌గించే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని ఆల్విన్ ఫార్మా కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో...

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close