తెరాస‌కు కీల‌క నేత గుడ్ బై… దేనికి సంకేతం..?

తెలంగాణ‌లో ఇప్పుడు తెరాస తిరుగులేని రాజ‌కీయ శ‌క్తి అన‌డంలో సందేహం లేదు. తిరుగులేని మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక‌… ఇత‌ర పార్టీల్లో కాస్తోకూస్తో మిగిలిన నాయ‌కులు కూడా తెరాస గూటికి చేరుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలామంది ఆ పార్టీ గూటికే చేరిపోయారు. తెలంగాణ‌లో నాయ‌కులు పార్టీ మారుతున్నారంటే… ఇత‌ర పార్టీల నుంచి తెరాస‌లోకి అనే వార్త‌లు చూస్తున్నాం. అధికారంలో ఉన్న తెరాస‌కు దూర‌మ‌య్యేవారు ఇప్పుడెవ‌రుంటారు..? ఎందుకుంటారు అనుకుంటాం..? కానీ, ఈ పరిస్థితుల్లో కూడా తెరాస‌కు గుడ్ బై చెప్పారు రామ‌గుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు స‌త్య‌నారాయ‌ణ‌.

2014లో ఆయ‌న తెరాస త‌ర‌ఫున పోటీ చేసి గెలిచారు. అంత‌కుముందు, కొన్నాళ్లు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ నుంచి టిక్కెట్ రాక‌పోయేస‌రికి.. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలిచారు. తెరాసలో చేరాక‌ ఆయ‌న‌కి ఆర్టీసీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు సీఎం కేసీఆర్‌. గ‌డ‌చిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెరాస నుంచి టిక్కెట్ ద‌క్కింది. కానీ, స్వ‌తంత్ర అభ్య‌ర్థి చేతిలో ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. కేసీఆర్ తో సాన్నిహిత్యం ఉండి, తెరాస అధికారంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న పార్టీకి ఎందుకు దూర‌మైన‌ట్టు..? ఈ ప్ర‌శ్న‌కి ఆయ‌న చెబుతున్న స‌మాధానం ఏంటంటే… పార్టీలో కొంత‌మంది అజ‌మాయిషీని త‌ట్టుకోలేక‌పోతున్నా అన్నారు! గ‌త ఎన్నిక‌ల్లో తాను ఓడిపోవ‌డానికి కార‌ణం కూడా కొంత‌మంది తెరాస నేత‌లే అనీ, వారిలో బాల్క సుమ‌న్ ఉన్నార‌నీ ఆరోపించారు. గౌర‌వ‌మూ మ‌ర్యాద ద‌క్క‌న‌ప్పుడు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా.. దాన్ని వ‌దులుకోవాల్సి వ‌స్తుంద‌న్నారు. తెరాస‌లో క్ర‌మ‌శిక్ష‌ణ లోపిస్తోంద‌నీ, అందుకే త‌న‌తోపాటు కొంద‌రు అనుచ‌రులు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నార‌నీ, త‌న‌వారంద‌రినీ పుర‌పాల‌క ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా గెలిపించుకుంటా అన్నారు.

తెరాస‌కు గుడ్ బై చెప్పింది మాజీ ఎమ్మెల్యే అయినా… అధికార పార్టీకి దూర‌మ‌వడం విశేషం! పార్టీలో కొంత‌మంది పెత్త‌నం పెరిగిపోయింద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మనార్హం. ఈ మ‌ధ్య కాలంలో తెరాస‌లో ఇలాంటి ప‌రిస్థితి ఉంద‌ని ఓపెన్ గా మాట్లాడిన నాయ‌కులు లేరు. నిజంగానే, అలాంటి ప‌రిస్థితులు పార్టీలో అంత‌ర్గ‌తంగా ఉన్నా కూడా, బ‌య‌ట‌ప‌డే ధైర్యం ఉండ‌ద‌నే చెప్పాలి. ఇత‌ర పార్టీల నేత‌లంతా తెరాసలో చేరాల‌ని చూస్తుంటే… ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చిన నాయ‌కులు కూడా ఉండ‌టం అనేది, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అనూహ్య‌మైన అంశ‌మే. దీన్ని భాజ‌పా సొమ్ముచేసుకునే అవ‌కాశం ఉంది. స‌త్య‌నారాయ‌ణ క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించినా, ఆయ‌న‌తో భాజ‌పా నేత‌లు ట‌చ్ లోకి వెళ్లిన‌ట్టు స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close