సోనాక్షీనీ వ‌ద‌ల‌ని బాల‌య్య‌!

నంద‌మూరి బాల‌కృష్ణ‌కు క‌థ‌లు వినిపించ‌డం, ఆయ‌న‌తో సినిమా ఓకే చేయించుకోవ‌డం చాలా సుల‌భ‌మైన విష‌యాలు. కానీ ఆయ‌నకు త‌గిన క‌థానాయిక‌ని ప‌ట్టుకోవ‌డానికి మాత్రం త‌ల ప్రాణం తోక‌కు వ‌స్తుంటుంది. బాల‌య్యకి ఎప్ప‌టి నుంచో క‌థానాయిక‌ల కొర‌త ఉంది. బాల‌య్య‌కు భ‌య‌ప‌డ‌తారో, లేదంటే.. నిజంగానే డేట్లు సెట్ కావో తెలీదు గానీ – క‌థానాయిక‌ల అన్వేష‌ణ ఓ విక్ర‌మార్క ప్ర‌య‌త్నంలా సాగుతూనే ఉంటుంది.

తాజాగా బాల‌య్యకు మ‌రోసారి క‌థానాయిక‌ల కొర‌త ఎదురైంది. గోపీచంద్ మ‌లినేనితో బాల‌య్య ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఇద్ద‌రు క‌థానాయిక‌లుంటారు. త్రిష‌, మెహ‌రీన్‌, శ్రుతి… ఇలాంటి పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయి. అయితే వీళ్లెవ‌రూ హీరోయిన్లు కాద‌ని తేలిపోయింది. ఇప్పుడు సోనాక్షీ పేరు కూడా వినిపిస్తోంది. ఇటీవ‌ల చిత్ర‌బృందం సోనాక్షిని సంప్ర‌దించిన‌ట్టు.. సోనాక్షి మాత్రం `నో` చెప్పిన‌ట్టు స‌మాచారం అందుతోంది. సౌత్ లో సినిమాలు చేయ‌డానికి బాలీవుడ్ భామ‌లు ఉత్సాహం చూపిస్తున్న వేళ ఇది. పైగా ఇటీవ‌ల చిరంజీవి సినిమా కోసం సోనాక్షిని సంప్ర‌దించిన‌ట్టు, తాను ఒప్పుకున్న‌ట్టు వార్త‌లొచ్చాయి. ఈ నేప‌థ్యంలో బాలయ్య‌కీ తాను ఓకే అంటుంద‌నుకున్నారు. కానీ.. `నో` అంటూ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. సో.. బాల‌య్య కోసం క‌థానాయిక‌ల వేట అనే అంకం.. సీరియ‌ల్ లా సాగుతూనే ఉంద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close