త్వ‌ర‌లో ‌కేసీఆర్, జగన్ కు అగ్ని పరీక్ష సిద్ధంగా ఉంది

తెలుగు రాష్ట్ర‌ల రాజ‌కీయాలు ఎన్నిక‌ల‌కు చాల కాలం ముందే అస‌క్తిక‌రంగా మారుతున్నాయి. అధికార పార్టీల‌తో పాటు ప్ర‌తిప‌క్ష‌ల‌కు సైతం ప్ర‌తి అడుగు జగ్ర‌త్త‌గా వెయాల్సిన ప‌రిస్తితి వ‌చ్చింది. ఇందుకు కార‌ణం లెక‌పోలెదు, ఆంధ్ర‌,తెలంగాణ‌లో వారి స్థానిక రాజ‌కీయం దృష్టిలో పెట్టుకొని ఓ పార్టీని ప్ర‌జ‌లంత ముకుమ్మ‌డిగా ద్వేశిస్తున్నారు. ఆ పార్టీల‌తో అంటాకాగిన ఎవ‌రినైన మ‌సిచెసెందుకు ప్ర‌జ‌లు ఎదురుచుస్తున్నారు. ఇటాంటి స‌మ‌యంలో అంద‌రు జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాల్సిన త‌రుణం వ‌చ్చెసింది..

ఇక అస‌లు క‌థ‌లోకి వెళ్తే త్వరలో జరిగే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ఇటు టీఆర్ఎస్ కు, అటు వైసీపీలకు అగ్ని పరీక్షగా మారబోతోంది. ఈ రెండు పార్టీలు కేంద్రంలోని బీజేపీతో రహస్య స్నేహాన్ని కొనసాగిస్తున్నాయని వారికి ప్ర‌తిప‌క్షంగా ఉండే పార్టీకి విమర్శిస్తున్నాయి. మోన్న పార్ల‌మెంట్ లో అవిశ్వాసం స‌మ‌యంలో ఈ పార్టీల వ్య‌వ‌హార శైలి కూడా ఇందుకు దోహాద ప‌డింది. ర‌హాస్యంగా సేహ్నం కోన‌సాగించాడానికి కార‌ణం లెక‌పోలెదు.. మోడీతో కేసీఆర్ చేతులు కలిపారన్న అభిప్రాయం జనాల్లో కలిగితే ముస్లీం ఓటుబ్యాంకు టీఆర్ఎస్ కు గండి పడే ప్రమాదం ఉంటుందని, అలాగే, ఆంధ్ర ప్రదేశ్ లో ప్ర‌త్యేక హోద ఇవ్వ‌ని నేప‌ధ్యంలో బీజేపీ – మోడీ పట్ల అక్కడ ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని.. అలాంటి పార్టీతో నేరుగా లేదా పరోక్షంగా కలిశారన్న భావన కలిగినా త‌మ తీవ్ర నష్టం కాబ‌ట్టి ఎటువంటి సంబంధ‌మైన ర‌హాస్యంగా ఉంచాల్సిందే.

ఈ నేపథ్యంలోనె త్వ‌ర‌లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో వ‌స్తున్నాయి. బిజేపికి ఇప్పుడు అది కావాంటే… టీఆర్ఎస్, వైసీపీల మద్ధతు అవసరమవుతోంది. తెలుగుదేశం ఎన్డీఏలో ఉండుంటే ఈ అవ‌స‌రం ఉండెది కాదు, కానీ అనుహ్యంగా తెలుగుదేశం ముందే బిజేపితో తెగ‌దెంపులు చెసు‌కుంది కాబ‌ట్టి ఇప్పుడు వీరి మ‌ద‌త్తు చాల అవ‌స‌రం.. ఈ మధ్యనే ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన సందర్భంలో డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం కూడా కేసీఆర్ తో చర్చించినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఎన్నికకు మద్ధతివ్వాల్సిందిగా కేసీఆర్ ను మోడీ కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ కు ఆరు రాజ్యసభ స్థానాలు ఉండగా… వైసీపీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు. బీజేడీ మద్ధతు ఇచ్చిన తర్వాత కూడా ఈ రెండు పార్టీల మద్ధతు బీజేపీకి అవసరమవుతుంది. టీడీపీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ బీజేపీతో కయ్యానికి కాలుదువ్వింది కనుక ఆ పార్టీ నుండి అశించిన బ‌లం ఇత‌రుల ద‌గ్గ‌ర నుండి తెచ్చుకొవాస్సిన ప‌రిస్తితి ఉంటుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, వైసీపీల మద్ధతు బీజేపీకి అనివార్యం అవుతుంది.

కథ అంతటితో అయిపోలేదు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారంలో ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో ఈ ఎన్నికకు అభ్యర్థిని నిలిపే యోచనలో కొన్ని ప్రాంతీయ శక్తులు వ్యూహ రచన చేస్తున్నాయి. అదే జరిగితే టీడీపీ అనివార్యంగా ఆ కూటమి అభ్యర్థికే మద్ధతిస్తుంది. కాంగ్రెస్ కూడా భవిష్యత్ అవసరాల దృష్ట్యా మమత కూటమికే మద్ధతివ్వచ్చు. అప్పుడు కేసీఆర్ ఏ లైన్ తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ ఇప్పటికే మమతా బెనర్జీని కలిసి చర్చలు జరిపారు. బీజేపీ, కాంగ్రెస్సేతర కూటమి అంటూ హడావుడి చేశారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ అభ్యర్థిని బరిలోకి దింపితే కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇటు మోడీ కోరిక మేరకు ఎన్డీయే అభ్యర్థికి ఓటేయాలా లేక తాను చెబుతోన్న ఫెడరల్ ఫ్రంట్ అభ్యర్థికి ఓటేయాలా అన్న సందిగ్ధ పరిస్థితిని కేసీఆర్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అదే సమయంలో జగన్ కూడా తన ఇద్దరు సభ్యులతో ఎవరికి ఓటు వేయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఎలాగూ జగన్ మద్ధతు అడుగుతుంది. ఆయన వారి కోరిక మేరకు కమలానికి జై కొడితే… ఆంధ్రాలో టీడీపీకి మరో బలమైన అస్త్రాన్ని ఇచ్చినట్టవుతుంది. ఇప్పటికే బీజేపీ – వైసీపీ మధ్య రహస్య స్నేహం కొనసాగుతోందని… కొన్ని ఆధారాలను టీడీపీ బయటపెట్టింది. తాజాగా డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో కమలానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మరింత ఇబ్బందులు వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాదంటే మోడీకి కోపం – అవునంటే ఏపీ ప్రజలకు కోపం అన్నట్టుగా వైసీపీ పరిస్థితి మారుతుంది. సైలెంట్ గా ఓటింగ్ కు దూరంగా ఉంటే… దేశ రాజకీయాల్లో వైసీపీ పాత్ర శూన్యం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గండం నుంచి ఇటు కేసీఆర్, అటు జగన్ ఎలా బయటపడతారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com