స్పైడ‌ర్ టీజ‌ర్ : ష్‌… మాట‌ల్లేవంతే!

మ‌హేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్పైడ‌ర్ టీజ‌ర్ వ‌చ్చేసింది. స్పైడ‌ర్‌… టైటిల్‌కి త‌గిన‌ట్టుగా, సినిమా థీమ్‌ని ప్ర‌జెంట్ చేస్తూ… టీజ‌ర్ క‌ట్ చేశాడు మురుగ‌దాస్‌. ఓ సాలెపురుగు.. మ‌హేష్ త‌ప్ప ఈ టీజ‌ర్‌లో ఏం క‌నిపించ‌లేదు. `ష్‌..` అంటూ మ‌హేష్ ఇచ్చిన సౌండింగ్ త‌ప్ప ఏం వినిపించ‌లేదు. ఈమ‌ధ్య టీజ‌ర్ అంటే.. ఓ పంచ్ డైలాగ్‌, నిమిషం పాటు బిల్డ‌ప్ షాట్స్… వీటికే అల‌వాటు ప‌డిపోయారు. వాటి మ‌ధ్య స్పైడ‌ర్ టీజ‌ర్ కొత్త‌గానే ఉన్నా.. మ‌హేష్ ఫ్యాన్స్ దీంతో పండ‌గ చేసేసుకొన్నా – ఎక్క‌డో ఏ మూలో మ‌ళ్లీ చిన్న అసంతృప్తి. ఏదో టీజ‌ర్ విడుద‌ల చేశామ‌న్న పేరుకి ఓ వీడియో వ‌దిలారా, ఇంత‌కు మించి.. ఏం చెప్ప‌కూడ‌ద‌నుకొన్నాడో తెలీదుగానీ… మురుగ‌దాస్ మ‌ళ్లీ స‌గం భోజ‌న‌మే పెట్టాడు. స్పైడ‌ర్ గ్రాఫిక్స్ క్వాలిటీ బాగుంది. `ద‌స‌రా విడుద‌ల` విష‌యంలో ఓ క్లారిటీ ఇవ్వ‌గ‌లిగాడంతే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com