రివ్యూ : రొటీన్, కమర్షియల్ కథ తో ‘శ్రీరస్తు శుభమస్తు’

‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై ‘అల్లు అరవింద్, బన్నీ వాసు’ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’ ఏ రోజుకా రోజు విభిన్నమైన ప్రచారం తో, మొదటి నుండి ట్రైలర్లు, ఇతర ప్రచార కార్యక్రమాలతో మంచి హైప్ క్రియేట్ చేసిన చిత్రం. స్టార్ ప్రొడ్యూసర్ తనయుడు, మెగా స్టార్ మేనల్లుడు, మరో స్టార్ సోదరుడు అనే క్వాలిటీస్( సినిమా బ్యాక్ గ్రౌండ్) తో, రెండు సినిమాలు చేసినప్పటికీ హీరోగా సరైన హిట్ అందుకోలేకపోయిన ‘అల్లు శిరీష్’ నటించిన మూడవ చిత్రం ఇది. ఈ చిత్రానికి దర్శకుడు ‘పరశురామ్’, హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో ఇప్పుడు చూద్దాం…

కథ :

మధ్య తరగతి అమ్మాయిలన్న, మధ్య తరగతి కుటుంబాలన్న సదాభిప్రాయం లేని తండ్రికి తను ప్రేమించిన అమ్మాయి తన ఆస్తిని చూసి కాకుండా, తనని తానుగా ప్రేమిస్తుందని నిరూపించడానికి ‘అడ్రస్‌ లేని వాడిగా’ ఆమెకి పరిచయం అవుతాడు శిరీష్ (అల్లు శిరీష్). అయితే తనలోనే లోకాన్ని చూస్తూ, తనే జీవితంగా బ్రతికేస్తున్న తండ్రి ఫీలింగ్స్‌కి కట్టుబడి ఉంటుంది అనన్య (లావణ్య త్రిపాఠి) .శిరీష్ మాత్రం నేను ఒక డబ్బులేని వాడిగానే అమ్మాయి ప్రేమను సాధిస్తానని వాళ్ళ నాన్నతో ఛాలెంజ్ చేస్తాడు. అలా ఛాలెంజ్ చేసిన శిరీష్ అనన్య ప్రేమను పొందడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? తండ్రి మాట జావా దాటని అనన్యను ఎలా మెప్పించాడు ? ఈ ప్రయత్నంలో అతనికి ఎదురైన అనుభవాలేమిటి ? చివరికి అనన్య ప్రేమను దక్కించుకున్నాడా లేదా ? అనేదే ఈ సినిమా మిగతా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

నటుడిగా అల్లు శిరీష్‌ కాస్త మెరుగయ్యాడు. ఓ బిజినెస్ మ్యాన్ కొడుకుగా, తండ్రితో ఛాలెంజ్ చేసి తన ప్రేమను గెల్చుకోవడానికి ప్రయత్నించే కుర్రాడిగా అల్లు శిరీష్ బాగున్నాడు. ఇంకా ఇంప్రూవ్‌ అవ్వాలి కానీ రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌లాంటి హేమాహేమీలతో పాటు తాను చాలా బాలన్స్ గా నటించ గలిగాడు. కీలకమైన క్లయిమాక్స్‌ సీన్‌లో అనుభవమున్న నటుడిలా కనిపించాడు. లావణ్య త్రిపాఠి ఎప్పటిలానే సహజ నటనతో ఆకట్టుకుంది. రావు రమేష్‌కి మరో సారి గుర్తుండిపోయే పాత్ర దక్కింది. ఆయన నటన ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌ అనొచ్చు . ప్రకాష్‌రాజ్‌ తన పాత్రని రక్తి కట్టించారు. చాలా రోజుల తర్వాత తెరపై కనిపించిన సుమలత ఆమె పాత్రకి సరిపడలేదు అలీకి నవ్వించే అవకాశం మళ్ళి ఈ చిత్రం లో దక్కింది. సుబ్బరాజు, ప్రభాస్‌ శ్రీను కామెడీ కూడా మాస్‌ని అలరిస్తుంది.మిగతా నటీనటులు ఓ కె.

సాంకేతిక వర్గం :

సినిమా లో మొదటగా చెప్పుకోవలసింది దర్శకుడు ‘పరశురామ్’ ఎంచుకున్న లవ్ అండ్ ఫామిలీ వ్యాల్యూస్ అనే కథాంశం. సినిమాలో సరిపడా వినోదం, కదిలించే భావోద్వేగాలు ఉండేట్టు జాగ్రత్త పడ్డాడు. అలాగే వాటి రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేస్తూ రాసుకున్న ఎంటర్టైనింగ్ డైలాగ్స్ కూడా బాగా వర్కవుట్ అయింది. ఈ రెండు అంశాల్లో ప్రతిభ కనబరిచిన పరశురామ్ రచయితగా సక్సెస్ అయ్యాడు. థమన్ అందించిన సంగీతం బాగుంది.టైటిల్‌ సాంగ్‌ ఆకట్టుకుంటుంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాగా హెల్ప్ అయింది. మణికంధన్ సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు వెయ్యొచ్చు. గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు ఎప్పటిలాగే బాగా రిచ్ గా ఉండి సినిమాను మరో మెట్టు పైకెక్కించాయి.

విశ్లేషణ :

‘శ్రీరస్తు శుభమస్తు’ స్టోరీ లైన్ టాలీవుడ్, బాలీవుడ్ లో రూపొందిన కొన్ని సినిమాలను గుర్తుకు తెస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ని టార్గెట్ చేసుకుని చేసిన సినిమా ఇది. ఫస్టాప్ మాములుగా ఉంటుంది. రొటీన్ స్టోరీ, బ్యాడ్ స్ర్కీన్ ప్లే ఈ సినిమాకి చాలా మైనస్. సెకండాఫ్ లోని కొన్ని సీన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. ప్రీ క్లయిమ్యాక్స్, క్లయిమ్యాక్స్ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. శిరీష్, లావణ్య త్రిపాఠీల మధ్య లవ్ కెమిస్ట్రీ బాగా పండింది. చిత్రం లోని ఎమోషనల్‌ సీన్స్‌ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండడంతో ‘రొటీన్‌ రొమాన్స్‌’ అయినప్పటికీ ‘శ్రీరస్తు శుభమస్తు’ కాస్త రక్తి కడుతుంది. ప్రథమార్థంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకథ బలహీనంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థం వినోదభరితంగా సాగుతుంది. ఇక పతాక సన్నివేశాల్లో డైలాగ్‌ రైటర్‌గా పరశురాం విజృంభించాడు. ప్రేమ, కుటుంబ విలువలు అనే అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్సుకు కావాల్సిన అన్ని భావోద్వేగాలను తనలో నింపుకుంది. నటీనటుల నటన, మోతాదుకు మించని కామెడీ, కుటుంబ భావోద్వేగాలు, బోర్ కొట్టించని కథనం ఈ సినిమాకు ప్రధానమైన బలాలు. రొటీన్, కమర్షియల్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

తెలుగు360.కామ్ 2.75/5
బ్యానర్ : గీతా ఆర్ట్స్
నటీనటులు : అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, అలీ, తనికెళ్ల భరణి, రావ్ రమేష్, రవిప్రకాష్, రణధీర్, సుబ్బరాజు, హంసానందిని, సుమిత్ర తదితరులు
సంగీతం : యస్. యస్.థమన్
సినిమాటోగ్రఫీ మణి కందన్,
ఎడిటింగ్ : మార్తాడ్ కె.వెంకటేష్
నిర్మాతలు : అల్లు అరవింద్, ‘బన్నీ’ వాసు ,
కథ, మాటలు, స్క్రీన్- ప్లే, దర్శకత్వం – పరశురామ్.
విడుదల తేదీ : 05.08.2016

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close