ఏపీలోనూ టెన్త్ పరీక్షలు రద్దు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పదో తరగతి పరీక్షల రద్దుకే మొగ్గు చూపింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ టెన్త్ పరీక్షలను నిర్వహిస్తామని నిన్నటి వరకూ ప్రకటించిన విద్యామంత్రి ఆదిమూలపు సురేష్..హఠాత్తుగా…పరీక్షల రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల లాక్ డౌన్ విధిస్తూ ఉండటం.. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూండటంతో అన్ని వర్గాల నుంచి పరీక్షల రద్దుకు డిమాండ్లు వినిపించడం ప్రారంభించాయి. అసెంబ్లీ సమావేశాలే నిర్వహించలేని పరిస్థితి ఉంటే…లక్షల మంది విద్యార్థులు రాసే టెన్త్ పరీక్షలను ఎలా నిర్వహిస్తారన్న విమర్శలు వినిపించడం ప్రారంభించాయి. అందరి అభిప్రాయాలు తీసుకున్నామన్న ప్రభుత్వం…చివరికి రద్దు చేస్తున్నట్లుగా నిర్ణయం ప్రకటించింది.

కొద్ది రోజులుగా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా..విపక్ష నేతలందరూ ఈ పరిస్థితుల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించడం తుగ్లక్ చర్య అని విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. అదే సమయంలో..తెలంగాణ,తమిళనాడు.పుదుచ్చేరి వంటి రాష్ట్రాలు.. పరీక్షలను రద్దు చేశాయి. దీంతో ఏపీ సర్కార్‌పై ఒత్తిడి పెరిగింది. కరోనా లాక్ డౌన్ విధించక ముందు జరిగిన పరీక్షలే తప్ప..తర్వాత ఏ రాష్ట్రంలోనూ ఒక్క పరీక్షకూడా జరగలేదు. కరోనా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఏపీ సర్కార్ కొత్తషెడ్యూల్ ప్రకటించింది.

వచ్చే నెల రెండో వారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. టెన్త్‌లో మొత్తం పదకొండు పేపర్లు ఉంటాయి. వాటిని ఆరుగా కుదించారు. ఎలా అయినా పరీక్షలునిర్వహించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కానీ పొరపాటున.. పరీక్షలు నిర్వహిస్తే.. విద్యార్థులకు కరోనా సోకితే…ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తాయన్న కారణంగా వెనుకడుగు వేసినట్లుగా తెలుస్తోంది. పరీక్షలు రద్దు చేసిన తర్వాత అంతర్గత పరీక్షల ఆధారంగా గ్రేడ్లు నిర్ణయించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close