25 తర్వాత స్టీల్ ప్లాంట్ షట్ డౌన్..!

విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఈ నెర ఇరవై ఐదు తరవాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్తామని.. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు నోటీసులో పేర్కొన్నాయి. నిబంధనల ప్రకారం.. నోటీసులు ఇచ్చిన పధ్నాలుగు రోజుల తర్వాత సమ్మె చేయాలి. పోస్కోతో స్టీల్ ప్లాంట్ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడమే డిమాండ్‌గా నోటీసులో పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో.. గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ నిర్మాణానికి పోస్కోతో ఒప్పందం పూర్తయిందని… ఇటీవలే వెలుగులోకి వచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం తెలుసని కేంద్రం కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. ఇంత కాలం.. ఏపీ సర్కార్ తమకేమీ తెలియదని బుకాయిస్తూ వచ్చినా… ఒప్పందం విషయం బయటపడటంతో కలకలం రేగుతోంది. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాల్నన డిమాండ్‌తోనే.. కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ఆందోళనలు రోజు రోజుకు ఉద్ధృతం అవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ సీఎండీతో పాటు కొంత మంది ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లిపోయారు. వారంతా ఒడిషాకు చెందినవారు. కొంత మంది డైరక్టర్లు స్టీల్ ప్లాంట్ వైపు రావడానికి భయపడుతున్నారు. ఇటీవల ఫైనాన్స్ డైరక్టర్‌ను ఆరు గంటల పాటు కార్మికులు నిర్బంధించారు. ఇప్పుడు కార్మికులు నేరుగా సమ్మె యోచన చేస్తూండటంతో స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయే ప్రమాదం ఉంది.

ఏ ఒక్క కార్మిక సంఘం కూడా ప్రైవేటీకరణకు మద్దతు తెలిపే అవకాశం ఉండదు. ఈ కారణంగా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఆగిపోనుంది. అదే జరిగితే ప్లాంట్ మరింత కష్టాల్లో పడుతుందని.. ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్న కేంద్రానికి మరింత అవకాశం ఇచ్చినట్లవుతుందన్న అభిప్రాయం కూడా.. కొంత మందిలో ఉంది. అయితే.. సమ్మె నిర్ణయానికే కార్మిక సంఘాలు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close