ఏపీపై తెలంగాణ పోలీసులది రాజకీయ కుట్రే..! ఈ అనుమానాలకు సమాధానాలేవి..?

ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం… ప్రైవేటు కంపెనీల వద్ద ఉన్నాయని తీవ్రమైన ఆరోపణలు చేసిన తెలంగాణ పోలీసులు ఇప్పుడు ఆ మాట మాట్లాడటం లేదు. పకడ్బందీగా.. సేవామిత్ర యాప్‌లో ప్రజల వ్యక్తిగత వివరాలు ఉన్నాయని.. అవి ఎలా వచ్చాయో విచారణ చేస్తున్నామని చెబుతున్నారు. ఓ వైపు ఇద్దరు కమిషనర్లు… ఏపీ ప్రభుత్వంపై ప్రజలకు సందేహాలు కలిగేలా.. అచ్చంగా రాజకీయ నాయకుల్లా ప్రకటనలు చేశారు. ఇప్పుడు వాటిపైనే ఏర్పాటైన సిట్.. విభిన్న వాదన వినిపిస్తోంది.

ఏపీ ప్రభుత్వ అధికారిక సమాచారం ఉందని ఇప్పుడు ఎందుకు చెప్పడం లేదు..?

“ఏపీ ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం.. ప్రైవేటు సంస్థ అయిన ఐటీ గ్రిడ్ వద్ద ఉంది. దీనిపై ఏపీ ప్రభుత్వానికీ నోటీసులు ఇస్తాం..” సివిల్ సర్వీస్ చదువుకుని ఏళ్ల పాటు ఐపీఎస్ అధికారిగా పని చేసిన సైబరాబాద్ సీపీ సజ్జనార్ చేసిన ప్రకటన ఇది. ప్రజల ఆధార్ డేటా, బ్యాంక్ అకౌంట్లు.. అంటూ ఆయన జాబితా చెప్పారు. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారం.. ప్రైవేటు సంస్థ వద్దుకు ఎలా వచ్చిందో చెప్పాలంటూ… ఓ లేఖ కూడా ఏపీ ఐటీ కార్యదర్శికి పంపినట్లు మీడియాకు చెప్పారు. అదే సమయంలో ఉడాయ్, ఈసీలకూ లేఖలు రాసినట్లు చెప్పారు. సజ్జనార్ ఆ ప్రకటన చేసిన తర్వాత ఇంకో కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన యాప్‌ పని తీరును వివరించారు. సర్వేలు చేయడం… వారి దగ్గర వివరాలు తెలుసుకోవడమే పెద్ద తప్పట్లుగా చెప్పి… ఆ సమాచారం అంతా “కీ పర్సన్‌”కు వెళ్తోందన్నట్లుగా వివరించారు. కొద్దిగా అలోచించేవారి… అది తప్పెలా అవుతుందనే స్ప్రహ వస్తుంది. కానీ స్కెచ్ చేసి.. ఏదో పెద్ద స్కెచ్ వేసినట్లు కమినషర్ షో చేశారు. ఇప్పుడు వాటిపై సిట్ వేశారు. సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర …ఏపీ ప్రభుత్వ అధికారిక సమాచారం.. ఐటీ గ్రిడ్ వద్ద ఉందని కానీ… యాప్‌లో ఉందంని కానీ చెప్పడం లేదు. బురద చల్లేసి తీరిగ్గా… పోలీస్ మార్క్ రాజకీయం చేస్తున్నారా..?

సేవామిత్రలో టీ ప్రజల సమాచారం ఉందని ఇప్పుడే ఎలా తెలిసింది..?

నిన్నటి వరకు.. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనర్లు… ఏపీ ప్రజల సమాచారం ఉందని.. అక్కడి ఓట్లను సేవామిత్ర యాప్ ద్వారా తీసేస్తున్నారని… రాజకీయ ఆరోపణలు చేశారు. ఇప్పుడు స్టీఫెన్ రవీంద్ర కూడా అదే చెబుతున్నారు. ఓట్లను తీసేస్తున్నారనేదే అనుమానం అయితే.. ఈసీ క్షణాల్లో సమాధానం ఇస్తుంది. ఓట్ల తొలగింపు చాలా తీవ్రమైన నిర్ణయం. కానీ లేఖలు రాస్తున్నాం అంటూ.. రాస్తున్నారో లేదో తెలియకుండా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే.. ఓట్ల తొలగింపు ప్రక్రియ ఎలా ఉంటుందో..ఈ పోలీసులు అందరికీ బాగా తెలుసు. అయినా.. ఆత్మవంచన చేసుకుని మరీ ఓట్ల తొలగింపు అనుమానాలంటూ మాట్లాడుతున్నారు. నిన్నటిదాకా.. అసలు టీడీపీయాప్‌లో తెలంగాణ ప్రజల సమాచారం ఉందని చెప్పని వారు.. ఇప్పుడు కొత్తగా ..తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం ఉందని చెప్పడంలోనే అసలు కుట్ర ప్రారంభమైంది. కేసును.. ఏపీకి బదిలీ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో.. అప్పుడు కుట్ర బయటపడుతుందేమో అన్న భయంతో ఈ అడుగులు వేశారు..!

టీఎస్ ప్రజల సమాచారం ఉంటే అక్కడి ప్రభుత్వం దొంగతనం చేసి ఐటీ గ్రిడ్ కు ఇచ్చినట్లు కాదా..?

“ఏపీ ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం.. ప్రైవేటు సంస్థ అయిన ఐటీ గ్రిడ్ వద్ద ఉంది. దీనిపై ఏపీ ప్రభుత్వానికీ నోటీసులు ఇస్తాం..” ఇదీ సీపీ సజ్జనార్ ఊవాచ. మరి సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం… కూడా.. ఉందని చెప్పారు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం .. ఆ సమాచారాన్ని చోరీ చేసి ఐటీ గ్రిడ్‌కు ఎందుకు ఇచ్చినట్లు కాదు..!. ఈ విషయంలో.. ఏపీ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసి.. నోటీసులు ఇస్తామని… అరెస్టులు చేస్తామనే ప్రకటన దాకా వెళ్లిపోయిన తెలంగాణ పోలీసులు ఒకే అంశంలో… రెండు రాష్ట్ర ప్రభుత్వాల పట్ల వేర్వేరుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు.

సమాచారం డిలీట్ చేశారని తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభించారా..?

కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు చూసుకోవడం.. పోలీసుల కర్తవ్యం. కానీ ఇది రాజకీయ కేసు. సాక్ష్యాలు కచ్చితంగా ఉంటాయన్న ఉద్దేశంతో కేసులు తీసుకుని సాక్ష్యాలు సేకరించడం ప్రారంభించారు. కానీ అక్కడ సాక్ష్యాలు ఏమీ లేవన్న క్లారిటీ వారికి వచ్చింది. కనీసం.. ఏ ఆధారంతో ఫిర్యాదు తీసుకుని రేపు కోర్టు ప్రశ్నిస్తే.. నీళ్లు నమలాల్సిన పరిస్థితి పోలీసులకు వచ్చింది. వారి దగ్గర ఇప్పుడు.. కోర్టులో కేసు ఫైల్ చేయడానికి కావాల్సిన ఆధారాలు లేవని.. వారి ప్రకటనలు బట్టే అర్థమైపోతుంది. అమెజాన్, గూగుల్‌లు అయినా ఉత్తినే లేఖలు రాస్తే సమాచారం ఇవ్వవు. అక్కడ వారు చెప్పే సమాచారం ఉందని.. ఆధారాలు ఇవ్వాలి. వాళ్ల పాలసీలు తెలంగాణ పోలీసుల రాజకీయ విధానాల్లా ఉండవు. ఐటీ గ్రిడ్ కంపెనీలో ఉన్న ప్రతి చిన్న ట్యాబ్ సహా పోలీసులు తీసుకెళ్లారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ అన్నారు. ఎథికల్ హ్యాకర్లు అన్నారు. ఇంకా.., ఢిల్లీలో ఉడాయ్ దగ్గరకు సర్వర్లను తీసుకెళ్లామన్నారు. అయినా.. సరే నిన్న స్టిఫెన్ రవీంద్ర.. తమ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పలేకపోయారు. తాము విచారణ చేస్తూండాగనే… సమాచారాన్ని డిలీట్ చేశారని… చెప్పుకొచ్చి.. చేతకాని తనాన్ని మొత్తం బయటపెట్టుకున్నారు. క్లిష్టమైన కేసని.. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వారు కావాలని చెప్పుకొచ్చారు. బహుశా.. లేని సమాచారాన్ని ఆయా సర్వర్లలో ఇరికించే టెక్నికల్ నిపుణులు.. ఇప్పుడు.. తెలంగాణ పోలీసులకు అవసరం ఏమో..?

“ఐటీ పోలీస్” కేటీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు..?

మార్చి రెండో తేదీన… సోదాలు జరిగిన తర్వాత ప్రభుత్వంలో ఎలాంటి అధికార పదవి లేని.. ఓ సాధారణ ఎమ్మెల్యే.. అధికార పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన తీర్పు చెప్పేశారు. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం.. అక్కడి ప్రభుత్వం చోరీ చేసి.. ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిందని.. చెప్పేశారు. ఆ తర్వాత సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా.. కేటీఆర్ మాటలకు అప్ డేటెడ్ వెర్షన్ వినిపించారు. ఎక్కడ మైక్ పట్టుకునే అవకాశం వచ్చినా చంద్రబాబును విమర్శించే కేటీఆర్.. ఇప్పుడు మాత్రం.. ఈ డాటా కేసుపై మాట్లాడటం లేదు.

“స్టీఫెన్ రవీంద్ర”ని బలిపశువు చేయడానికేనా..?

చూడబోతోంటే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై.. తెలంగాణ పోలీసులు ఓ రాజకీయ కుట్ర చేశారన్నదానికి స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో సిట్ ఏర్పాటు ద్వారా ప్రభుత్వం.. తమకు ఏ మాత్రం ఇష్టం లేని.. ఓ ఆంధ్రా ప్రాంత సిన్సియర్ ఐపీఎస్‌ని బలి చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇది కూడా వ్యూహం అనే అనుమానాలు పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. స్టీఫెన్ రవీంద్ర సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆయన సర్వీస్ రికార్డు…సినిమాలకు కథలుగా ఉంటుంది. ఆయన తెలంగాణ ఉద్యమసమయంలో వ్యవహరించిన తీరుపై.. అప్పట్లో టీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సందర్భంలో ఓ సారి… హరీష్ రావు.. స్టీఫెన్ రవీంద్రపై భౌతికంగా దాడి కూడా చేశారు. ఇప్పుడు సిట్ కు ఈ కేసును ఇవ్వడం వల్ల.. కోర్టు వేసే అక్షింతలన్నీ… ఆయనకే పడతాయి తమకేమీ సంబంధం లేదని తప్పించుకోవచ్చన్న మరో కుట్ర తెలంగాణ సర్కార్ లో ఉన్నట్లుగా పోలీసు వర్గాల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close