ఆర్జీవీ గాలి తీసేసిన ద్వివేదీ..!

మే ఒకటిన ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుదల చేస్తామని హడావుడి చేసిన రామ్‌గోపాల్ వర్మకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. తాము ఆ సినిమాను విడుదల చేయడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వడం కానీ… ఆంక్షలు సడలించడం కానీ చేయలేదని.. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ స్పష్టం చేశారు. నిజానికి రామ్ గోపాల్ వర్మ… ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన.. ఈసీకి ఓ లేఖ రాశారు. అందులో… మే 1న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదలకు అనుమతివ్వాలని… కోరారు. ఈసీ దానిపై ఎలాంటి నిర్ణయం చెప్పక ముందే.. రామ్ గోపాల్ వర్మ.. ఒకటో తేదీన సినిమా విడుదల అంటూ పోస్టర్లేశారు.

సోషల్ మీడియాలో హంగామా ప్రారంభించారు. ప్రమోషన్ కోసం అంటూ… విజయవాడకు వెళ్లి హడావుడి చేశారు. ఈ ఘటనల నేపధ్యంలో.. ఈసీ.. ఆర్జీవీ రాసిన లేఖకు స్పందన తెలియచేసింది. దేశవ్యాప్తంగా బయోపిక్‌లపై నిషేధం విధిస్తూ…ఏప్రిల్‌ 10న కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని .. ఆ ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిందేనని ద్వివేదీ స్పష్టం చేశారు. ఆ సినిమా విడుదలకు సంబంధించి.. ఈసీ ఎలాంటి సడలింపులు ఇవ్వలేదని కలెక్టర్లకు ఈసీ సమాచారం పంపింది. కొద్ది రోజులుగా.. ఎన్నికల సంఘం.. పూర్తి స్థాయిలో .. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి.

ఈ తరుణంలోనే ఆర్జీవీ… ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిచి మరీ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రచారాన్ని ప్రారంభించారు. అయినా ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో… వైసీపీ నేతలు పర్మిషన్ ఇప్పించి ఉంటారన్న ప్రచారం జరిగింది. కానీ.. రిలీజ్ కు ముందు రోజు మాత్రం.. దీనిపై ఈసీక్లారిటీ ఇచ్చింది. ఫలితాల తర్వాతే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close