అమరావతి రైతుల పోరాటం ఏ దరికి..!?

రెండు నెలల కిందట… అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు వచ్చినప్పటి నుండి రైతులు.. పోరుబాట పట్టారు. పోలీసుల నిర్బంధాలను ఎదుర్కొన్నారు. లాఠీ దెబ్బలను తిన్నారు. కేసుల పాలయ్యారు. ఈ రెండు నెలల కాలంలో.. నలబై మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి వారికి ఎక్కడా కనీసం ఊరట లభించలేదు. అన్ని పార్టీలు మద్దతిస్తున్నా.. పాలక పార్టీ.. అసలు వారిని ఏపీ ప్రజలుగానే భావించకపోవడంతోనే సమస్య వస్తోంది.

రాజధాని రైతులు ఏపీ ప్రజలు కాదా..?

ప్రభుత్వాన్ని నమ్మి భూముల్ని తృణప్రాయంగా రైతులు ఇచ్చేస్తే.. ఆ ప్రభుత్వమే.. ఇప్పుడు .. రైతుల్ని నడి రోడ్డున పడేసింది. రోడ్డెక్కిన రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులుగా మంత్రులు చిత్రీకరించి.. లైట్ తీసుకున్నారు. చర్చలు కాదు కదా.. అసలు వారిని.. ఏపీ పౌరులు కాదన్నట్లుగా ఛీత్కరిస్తున్నారు. వారిపై పోలీసుల్ని ప్రయోగించారు కానీ.. భూములిచ్చారన్న సానుభూతి చూపించడం లేదు. తాము ఓ విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని.. దాని వల్ల నష్టపోతే.. భర్తీ చేస్తామని ప్రభుత్వంగా అది తమ బాధ్యత అని చెప్పలేదు. భరో సా ఇవ్వలేదు. కానీ మరింతగా రెచ్చగొట్టారు. వారిపై కులం ముద్ర వేశారు. రాష్ట్ర వ్యతిరేకులన్నారు. ఇంకా.. రాజకీయం మొత్తం ప్రదర్శించారు. వారిప్పుడు ప్రభుత్వం దృష్టిలో … ఏపీ ప్రజలు కాదన్నట్లుగా పరిస్థితి మారింది.

ఎవరేమనుకున్నా అమరావతి మాత్రం వద్దే వద్దన్న పద్దతిలో జగన్..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అమరావతిలో ఉండటానికి ఇష్టపడటం లేదు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తన ఇష్టమని..అసెంబ్లీ వేదికగా డిక్లేర్ చేసుకున్న ఆయన.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత విశాఖ వెళ్లిపోవడానికి .. నిర్ణయించుకున్నారు. విశాఖ వెళ్తే ముఖ్యమంత్రి వెళ్లొచ్చు కానీ.. యంత్రాగాన్ని తీసుకెళ్లడానికి చిక్కులు తప్పవని.. హైకోర్టులో రైతులు వేసిన పిటిషన్లపై వాదిస్తున్న న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేరుగా చెప్పేశారు. అయితే చట్టబద్ధంగా ఎలా మూడు రాజధానుల్ని చేయాలా అని జగన్ తర్జన భర్జన పడుతున్నారు. మండలి రద్దు.. ఆర్డినెన్స్.. అంటూ.. యంత్రాంగం మొత్తాన్ని పరుగులు పెట్టిస్తున్నారు కానీ.. రైతుల గురించి మాత్రం.. ఆలోచించడం లేదు. తరలింపు ఎజెండానే ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఎప్పుడైతే.. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారో.. అప్పట్నుంచే తరలింపు ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి బొత్స.. పదే పదే చెబుతున్నారు.

కేంద్రాన్ని కదిలించని రైతుల ఆవేదనలు..!

అసలు కేంద్రం స్పందన ఏమిటన్నదానిపై ఇంత వరకూ క్లారిటీ లేదు. ఏపీ బీజేపీ నేతలు అమరావతిని తరలిస్తే ఊరుకోబోమని చెబుతున్నారు. కేంద్ర బీజేపీ నేతలు.. రాజధాని రాష్ట్ర పరిధిలోనిదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం.. రాజధానిగా అమరావతిని ఎప్పుడో నోటిఫై చేశామని చెప్పినా .. ఇప్పుడు మార్చుకోవడానికి అవకాశం ఉందన్నట్లుగా రాష్ట్ర పరిధిలోని అంశం అని హింట్ ఇచ్చింది. తప్ప.. ప్రత్యేకమైన అభిప్రాయం వ్యక్తం చేయలేదు. రాష్ట్ర పరిధిలోని అంశమని ఎంత చెప్పినా.. విభజన చట్టం ప్రకారం..కేంద్ర ప్రమేయం ఉంటుంది. కానీ ఈ అడ్వాంటేజ్‌ను తీసుకోవడానికి కేంద్రం సిద్ధంగా లేదనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. రాజకీయాలన్ని కలిపి..రైతుల్ని నట్టేట ముంచాయనేది మాత్రం నిజం. వారిని అలా వదిలేస్తారో.. ఏదో ఓ పరిష్కారం చూపుతారో వేచి చూడాల్సిందే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close