సుకుమార్‌కి ఇంకా ఛాన్స్ ఉంది

మ‌హేష్ బాబు – సుకుమార్ కాంబో గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ సినిమా ఆగిపోయింద‌ని, మ‌హ‌ర్షి త‌ర‌వాత వెంట‌నే అనిల్ రావిపూడి సినిమాని ప‌ట్టాలెక్కిస్తాడ‌ని టాక్ న‌డుస్తోంది. సుకుమార్‌కీ, మ‌హేష్‌కి మ‌ధ్య అనిల్ రావిపూడి వ‌చ్చిన మాట వాస్త‌వ‌మే. అయితే.. సుకుమార్ త‌లుపులు ఇంకా మూసుకుపోలేదు. త‌న‌కి ఇంకా ఛాన్సు ఉందని తెలుస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌హేష్ బాబుకి సుకుమార్ మూడు క‌థ‌లు వినిపించాడ‌ని స‌మాచారం. అందులో రెండు క‌థ‌లు మ‌హేష్‌కి ఏమాత్రం న‌చ్చ‌లేదు. మూడో క‌థ ఓకే అనిపించి, అందులో కొన్ని మార్పులు చేసుకుర‌మ్మ‌న్నాడ‌ని తెలుస్తోంది. అందుకు కొంత స‌మ‌యం కూడా ఇచ్చాడ‌ట‌. ఈలోగా సుకుమార్ రిపేర్లు చేస్తే స‌రే, స‌రి. లేదంటే… అనిల్ రావిపూడి సినిమాని ప‌ట్టాలెక్కిస్తాడు. ఈమ‌ధ్యే అనిల్ కూడా మ‌హేష్‌కి ఓ క‌థ వినిపించాడు. ద్వితీయార్థం టేకాఫ్ విష‌యంలో మ‌హేష్ కొన్ని అభ్యంత‌రాలు లేవనెత్తాడ‌ని తెలుస్తోంది. దాంతో… అనిల్ కూడా రిపేర్ల ప‌నిలో ప‌డ్డాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close