ఇది పక్కా : చిరు 150లో సునీల్‌

చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని సినిమాల్లోకి అడుగుపెట్టా.. అని సునీల్ చాలా సంద‌ర్భాల్లో చెప్పాడు. చిరు ఆశీర్వాదం కూడా సునీల్‌పై ఉంది. మొన్న‌టికి మొన్న జ‌క్క‌న్న ఆడియో ఫంక్ష‌న్‌కి అతిథిగా వెళ్లి ఆశీర్వ‌దించి వ‌చ్చాడు సునీల్‌. అలాంటి చిరు 150వ సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చినా, కాల‌ద‌న్నుకొని మెగా ఫ్యాన్స్‌ని నివ్వెర ప‌రిచాడు సునీల్‌. కాల్షీట్ల స‌మ‌స్య వ‌ల్లే చిరు సినిమాలో న‌టించే చాన్స్ కోల్పోయాన‌ని బాధ‌ప‌డ్డాడు కూడా. అయితే… ఇప్పుడు చిరు 150వ సినిమాలో న‌టించే అవ‌కాశం మ‌రోసారి అందుకొన్నాడు సునీల్‌. ఈ విష‌యాన్ని సునీల్ కూడా ధృవీక‌రించాడు.

”అన్న‌య్య సినిమాలో న‌టించే అవ‌కాశం ఓసారి వ‌చ్చింది. కానీ దాన్ని చేజార్చుకొన్నా. అయితే.. ఇప్పుడు మ‌ళ్లీ ఆ ఛాన్స్ వ‌చ్చింది. ఇది వ‌ర‌కు ఓ పాత్ర కోసం అడిగారు. అప్పుడు కాల్షీట్లు అందుబాటులో లేవు. ఇప్పుడు మ‌రో పాత్ర కోసం న‌న్ను తీసుకొన్నారు. ఈసారి ఈ ఛాన్స్ మిస్ చేసుకోను. సెప్టెంబ‌రులో నా పార్ట్ తెర‌కెక్కిస్తారు” అని చెప్పుకొచ్చాడు సునీల్‌. సో.. చిరు సినిమాలో సునీల్ ఉన్నాడ‌న్న‌ది ఖాయ‌మైంది. మ‌రి.. ఈ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో, ఏంటో??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close