బాలయ్య 100వ సినిమా హీరోయిన్ ఆమెనా..?

99వ సినిమా డిక్టేటర్ తో మరోసారి తనలో ఉన్న మాస్ యాంగిల్ తో ప్రేక్షకులను, నందమూరి అభిమానులను అలరించిన బాలయ్య ఇప్పుడు తన 100వ సినిమాకు కావాల్సిన కార్యక్రమాలను కూడా మొదలెట్టాడు. ఇప్పటికే తన 100వ సినిమా ఆదిత్య 369కు సీక్వెల్ గా ఆదిత్య 999 అంటూ సంచలన నిర్ణయం తీసుకున్న బాలకృష్ణ మరోసారి తన నవరస నటనా సౌరభాన్ని చూపించనున్నాడు. సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో టైం మిషన్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆదిత్య 369 అప్పట్లో సంచలన విజయం దక్కించుకుంది.

తన 100వ సినిమా చరిత్రలో మిగిలిపోయేలా ఉండాలని ఆదిత్య సీక్వెల్ మూవీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు బాలయ్య బాబు. అయితే సినిమాకు కథ, కథనాలు ఎవరు అందించనున్నారన్న దాని మీద ఓ క్లారిటీ రాలేదు కాని సినిమాలో ఒక హీరోయిన్ గా మాత్రం తాప్సీని తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. సౌత్ లో సూపర్ క్రేజ్ ఉన్న తాప్సీ కొంతకాలం తెలుగు సినిమాలు చేసినా ఇప్పుడు తమిళ సినిమాలకే పరిమితమైంది.

ఇక అమ్మడు బాలీవుడ్ లో కూడా అప్పుడప్పుడు తన అదృష్టాన్ని పరిక్షించుకుంటుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఆదిత్య 999 సినిమాకు సడెన్ గా తాప్సీ పేరు తెర మీదకు రావడం తెలుగులో క్రేజీ హీరోయిన్స్ కు మింగుడుపడని వార్త అయ్యింది. లెజెండ్, లయన్, డిక్టేటర్ సినిమాల్లో హీరోయిన్ గురించి అంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని బాలయ్య ఈ సినిమాకు మాత్రం ముందునుండి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ పాత్రకు ఎవరైతే బాగుంటారో వారికి డేట్స్ అడ్జెస్ట్ అయ్యేలా చర్చలు జరుపుతున్నారట. తాప్సీ సెలక్షన్ నిజమే అయితే అమ్మడికిది ఓ లక్కీ చాన్స్ అన్నట్టే. మీరేమంటారు రీడర్స్..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close