త‌మ‌న్నా ఫ్యూచ‌ర్‌… బాహుబ‌లితో తేలిపోద్ది

త‌మ‌న్నా టాలెంట్ గురించి కొత్త‌గా చెప్పాల్సిందేం లేదు. న‌ట‌న‌, గ్లామ‌ర్‌, డాన్సులు… వీటిలో త‌మ‌న్నాకి తిరిగేలేదు. అయితే కొన్నాళ్లుగా త‌మ‌న్నా కెరీర్ న‌త్త‌న‌డ‌క న‌డుస్తోంది. బాహుబ‌లి సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యినా… త‌మ‌న్నాకి ఒరిగిందేం లేదు. బాహుబ‌లి 2 త‌ప్ప ప్ర‌స్తుతం త‌మ‌న్నా చేతిలో మ‌రో సినిమా లేదు. ఇందులో కూడా త‌మ‌న్నా పాత్ర‌కు అంత ప్రాధాన్యం ఏం లేద‌ని సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈసారి త‌మ‌న్నా క‌నిపించేది కాసేపే అని, సెకండాఫ్‌లో ఫోక‌స్ అంతా అనుష్క‌పైనేన‌ని తెలిసింది. అయినా స‌రే.. బాహుబ‌లి 2పై త‌మ‌న్నా భారీ ఆశ‌లు పెంచుకొంది. బాహుబ‌లి పేరు చెప్పి క‌నీసం బాలీవుడ్ లో అయినా రెండు మూడు ఛాన్సులు తెచ్చుకోవాల‌ని చూస్తోంది. అయితే త‌మ‌న్నా ప‌ప్పులేం ఉడికేట్టు క‌నిపించ‌డం లేదు. బాహుబ‌లి 2 త‌ర‌వాత త‌మన్నా పూర్తిగా ఖాళీ అయిపోనుంది. ఈలోగానే ఒక‌ట్రెండు సినిమాల్ని త‌న ఖాతాలో వేసుకోవాల‌ని చేసిన విశ్వ ప్ర‌య‌త్నాలేం వ‌ర్కవుట్ కాలేదు.

క్వీన్ తెలుగు రీమేక్‌లో త‌మ‌న్నాకి ఛాన్సొచ్చింది. అది ఒప్పుకొన్నా… త‌మ‌న్నా చేతిలో క‌నీసం ఆ సినిమా అయినా మిగిలేది. కానీ… మ‌రీ బెట్టుకుపోయి, పారితోషికం విష‌యంలో పేచీకి దిగి, ఆ సినిమా ఛాన్స్ కూడా వ‌దులుకొంది. కేవ‌లం పారితోషికం విష‌యంలో నిర్మాత‌కీ, త‌మ‌న్నాకీ మ‌ధ్య లెక్క‌లు తేడా రావ‌డంతో క్వీన్ సినిమాని వ‌దులుకొంది త‌మ‌న్నా. ఇప్పుడు మాత్రం.. ‘స‌రేలెండి… మీరిస్తాన‌న్న పారితోషిక‌మే ఇవ్వండి’ అంటూ క‌బురు పంపుతోంద‌ట‌. అయినా స‌రే..క్వీన్ నిర్మాత‌ల నుంచి స‌రైన స్పంద‌న రాలేద‌ని, త‌మ‌న్నా ప్లేసులో మ‌రో క‌థానాయిక‌ని ఎంచుకొన్నార‌ని దాంతో త‌మ‌న్నా ఆశ‌లు ఆవిరైపోయాయ‌ని టాక్‌. బాహుబ‌లి 2 త‌ర‌వాతైనా త‌మ‌న్నా ఖాతాలో ఓ సినిమాప‌డుతుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close