తమ్మినేని తాజా డైలాగ్ ” స్పాట్‌లోనే కొడతా..!”

స్పీకర్ తమ్మినేని సీతారం మొదట ఆముదాల వలస ఎమ్మెల్యే. ఆయన స్పీకర్‌గా.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు లేదా.. స్పీకర్ హోదాలో అధికారిక సమావేశాల్లో పాల్గొన్నప్పుడు మాత్రం… ఆ స్థాయిలో ఉంటారు. మిగతా సందర్భాల్లో ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తూంటారు. అందుకే పలు సందర్భాల్లో తనదైన శైలిలో పరుషమైన వ్యాఖ్యలు చేసి..మీడియాలో హైలెట్ అయ్యారు. చంద్రబాబు గుడ్డలూడదీస్తామన్నా…. సోనియా గాంధీ, చంద్రబాబులది.. రాజకీయ లం… త్వం అని.. ఏ మాత్రం సంకోచించకుండా చెప్పినా… అది ఆయన స్టైల్. తాజాగా.. ఆయన అధికారులపై తన నోటి పవర్ చూపించారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే స్పాట్‌కొచ్చి కొడతా అని దూసుకెళ్లారు.

మహాత్మ జ్యోతిబాపూలే వర్థంతి సందర్భంగా శ్రీకాకుళంలో అధికారులు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి.. తమ్మినేని సీతారాం హాజరయ్యారు. కానీ.. ఆయనకు అధికారులు అధికారికంగా ఆహ్వానం పంపలేదట. అందుకే.. కార్యక్రమానికి రాగానే..అధికారులపై విరుచుకుపడ్డారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘన పునరావృతమైతే స్పాట్లో కొట్టేస్తానని హెచ్చరించారు. స్పీకర్ ఆగ్రహం చూసి.. అధికారులు కూడా ఫీలైపోయారు. అసలు జరిగిందేమిటో చెప్పకుండా… ఇలా చేయడంతో వారు మనస్థాపానికి గురయ్యారు.

నిజానికి శ్రీకాకుళం యూనివర్శిటీలో పాల్గొనేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిన్ననే వచ్చారు. ఆయన పర్యటన ఏర్పాట్లను అధికారులు చేశారు. అందరూ … గవర్నర్ పర్యటనలో బిజీగా ఉంటారు కాబట్టి.. ఎవరిని ఆహ్వానించినా రారనే ఆలోచనతో పిలువలేదని.. అధికారులు చెబుతున్నారు. ముందు తాను ఎమ్మెల్యేని.. తర్వాత స్పీకర్‌ని అని పదే పదే చెప్పే.. తమ్మినేని.. ఎక్కడికి వెళ్లినా.. స్పీకర్ ప్రోటోకాల్ పాటించాల్సిందేనని.. డిమాండ్ చేయడమే అసలు విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేరళ, బెంగాల్ గవర్నర్లు అలా.. .. ఏపీ గవర్నర్ ఇలా..!

గవర్నర్ రాజ్యాంగాధిపతి. రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగితే జోక్యం చేసుకోవాల్సింది ఆయనే. ఆయనకు అలాంటి అధికారాలు ఉన్నాయి కాబట్టే... బెంగాల్, కేరళ వంటి చోట్ల.. ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేస్తున్నారు. కేంద్రానికి ఫిర్యాదులు పంపుతున్నారు....

ద‌ర్శ‌కేంద్రుడి ఓల్డ్ స్కూల్ స్టైల్‌లో `ఓ బాబూ..`

రాఘ‌వేంద్ర‌రావు... న‌టుడిగా మేక‌ప్ వేసుకుని తొలిసారి కెమెరా ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. త‌నికెళ్ల భ‌ర‌ణి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `ఓ.. బాబూ` అనే పేరు ప‌రిశీల‌న‌లో వుంది. ఈ చిత్రానికి...

ఆచార్య టీజ‌ర్ అప్ డేట్‌

`టీజ‌ర్ వ‌ద‌లుతావా.. లేదంటే లీక్ చేసేయ్య‌మంటావా` అంటూ కొర‌టాల శివ‌కు స్వీట్ అండ్ సెటైరిక‌ల్ వార్నింగ్ ఇచ్చారు చిరంజీవి. `ఆచార్య‌` టీజ‌ర్‌పై చిరు త‌న‌కు తాను వేసుకున్న సెటైర్ ఇది. దానికి కొర‌టాల...

పవన్ & రానా సినిమా: అయ్యప్పనుం కోషియుం తెలుగులో వర్కౌట్ అవుతుందా?

పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ చంద్ర దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన సహకారం తో ఇటీవల మొదలైన సినిమా, అయ్యప్పనుం కోషియుం అన్న మలయాళం సినిమా ఆధారంగా తెరకెక్కుతోంది. అయితే...

HOT NEWS

[X] Close
[X] Close