పెట్రో ధరల తగ్గింపు ఎన్నికల స్కిట్లేనా? మళ్లీ పెంచేస్తారా ?

పెట్రో ధరలను కేంద్రం రూ. ఐదు తగ్గిస్తే చాలా రాష్ట్రాలు రూ. ఏడు వరకూ తగ్గించాయి. డీజిల్‌పైనా అంతే. దీంతో ఒక్క సారిగాచాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డిజిల్ రేట్లు దిగి వచ్చాయి. ఇది ప్రజలకు కాస్త ఉపశమనమే. కానీ ఎక్కువ మంది ప్రజలు నమ్మలేకపోతున్నారు. మళ్లీ పెంచడం ఖాయమని.. తగ్గింపు అనేది రాజకీయ ప్రయోజనాల కోసమేనని అనుమానిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంటే మూడు నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్, ఆ రాష్ట్రంలో గెలిస్తేనే తర్వాత మళ్లీ మూడో సారి కేంద్రం లో అధికారంలోకి వచ్చేది.

లేకపోతే సీన్ రివర్స్ అవుతుంది. అలాగే పంజాబ్‌తో పాటు మరో మూడు కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలుజరుగుతాయి. ఫలితాలు తేడా వస్తే బీజేపీ బేస్ కరిగిపోతుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పెట్రోధరలు, గ్యాస్ ధరలు ఓట్ల ప్రయారిటీని డిసైడ్ చేస్తే బీజేపీ కొట్టుకుపోతుంది. అందుకే ముందు జాగ్రత్తగా కేంద్రం కాస్త పన్నులను తగ్గించి.. రాష్ట్రాలను తగ్గించాలని కోరింది. ఇదే సందుగా ఉత్తరప్రదేశ్ సీఎం పెద్ద ఎత్తున ఎక్సైజ్ ట్యాక్స్ కట్ చేశారు. ఇప్పటి వరకూఎంత పన్ను వసూలు చేశారన్న సంగతి పక్కన పెట్టి ఎన్నికలకు ముందు స్కిట్స్ ప్రారంభించేశారు.

అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలు అదే చేస్తున్నాయి. పెద్ద ఎత్తున పన్నులను తగ్గిస్తున్నాయి. పెట్రోల్ ధరను వంద కంటే తక్కువ స్థాయికి తెస్తున్నాయి. ఇది బాగానే ఉన్నా ఎన్నికలైన తర్వాత మళ్లీ బాదేస్తారుగా అన్న అనుమానం మాత్రం ప్రజల్లో ఉంది. గత అనుభవాలు అదే్ చెబుతున్నాయి. ఎన్నికలు ఉన్నప్పుడల్లా పెట్రో ధరలు పెంచకుండా నిలుపుదల చేసి.. ఆ తర్వాత ఒక్క సారిగా రేట్లను పెంచేస్తూ ఉంటారు. ఈ సారి కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. అధికార పార్టీని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారో లేదో ఎన్నికల ఫలితాలు తేల్చేస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close