‘టాక్సీవాలా’ ఎడ్వాంటేజ్ కోల్పోతోందా?

గీత గోవిందం కంటే ముందే విడుద‌ల కావాల్సిన సినిమా `టాక్సీవాలా`. అనుకోని ప‌రిస్థితుల వ‌ల్ల ఆ సినిమా వాయిదా ప‌డింది. అయితే అదీ మంచికే అయ్యింది. `గీత గోవిందం` త‌ర‌వాత విజ‌య్ న‌టించిన ఏ సినిమా విడుద‌లైనా.. ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోతాయ్‌. ఆ స్థాయిలో స్టార్ డ‌మ్ సంపాదించుకున్నాడు. `టాక్సీవాలా`కి అది బాగా ప్ల‌స్ అయ్యే అవ‌కాశాలున్నాయి. ఎందుక‌నో.. ముందు నుంచీ `టాక్సీవాలా`కి క్రేజ్ లేదు. విడుద‌ల వాయిదాలు ప‌డుతూ రావ‌డం వ‌ల్ల అది అంత‌కంత‌కూ త‌గ్గుతూ వ‌స్తోంది. `గీత గోవిందం` ఒక్క‌సారిగా బ్లాక్ బ్ల‌స్ట‌ర్ అయిపోవ‌డం `టాక్సీవాలా`కి బాగా క‌లిసొస్తుంది. ఆ సినిమా చూపించి, ఈ సినిమాని మంచి రేట్లకు అమ్ముకోవొచ్చు. సొంతంగా విడుద‌ల చేసుకున్నా.. సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోతాయ్‌. అయితే ఆ అడ్వాంటేజీ ఇప్పుడు `టాక్సీవాలా` కోల్పోయే ప్ర‌మాదంలో ప‌డింది. ఎందుకంటే `టాక్సీవాలా` కంటే ముందు `నోటా` విడుద‌ల కానుంది. `నోటా` రెండు భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల అవుతోంది. ఒక్క‌సారి డేట్ ఫిక్స‌యితే మార్చ‌డం క‌ష్టం. `టాక్సీవాలా` పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. `నోటా` విడుద‌ల‌య్యాకే… `టాక్సీవాలా` బ‌య‌ట‌కు రాబోతోంద‌ని స‌మాచారం. `నోటా` కూడా హిట్ట‌యిపోతే… `టాక్సీవాలా`రేంజు ఎక్క‌డికో వెళ్లిపోతుంది. అటూ ఇటూ అయితే.. మ‌ళ్లీ య‌ధాస్థితికి వ‌చ్చేస్తుంది. `గీత గోవిందం` అడ్వాంటేజీ అటు టాక్సీవాలాకు ద‌క్కుతుందా? ఇటు నోటా ఎగ‌రేసుకుని పోతుందా? అనేది ఆస‌క్తి క‌లిగిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com