ఎలా ఓడిపోయారో టీడీపీ నేతలకు ఇప్పటికీ అర్థం కావడం లేదట..!

ఘోర ఓటమికి కారణాలేంటో వెతుక్కునే పనిలో పడింది తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే అంతర్గతంగా కొంత చర్చ జరిగినా.. రాష్ట్రవ్యాప్తంగా నేతలంతా ఒక్కచోటకు చేరి ఓటమిపై విశ్లేషించారు. ప్రతి జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు పోటీ చేసిన నేతలు, సీనియర్‌ కార్యకర్తలు హాజరయ్యి.. తమ వాదనలు వినిపించారు. ఓటమిపై తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలంతా విజయవాడలో సమావేశం అయ్యారు. ఏ వన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఓటమికి కారణాలపై సుదీర్ఘంగా విశ్లేషించారు. ప్రతిసారి ఓటమికి కారణాలు కనిపించేవని.. కానీ ఈ సారి ఎన్నికల్లో చెప్పుకోదగ్గ కారణాలేవి కనిపించడం లేదని స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత అయిదేళ్లలో ఎప్పుడూ చేయనన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా… ఓటమి పాలవ్వడంపై క్షేత్రస్థాయిలో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు.

ఎన్నికల్లో ఘోర ఓటమిపై పార్టీ నేతలు తమ అభిప్రాయాలు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన నేతలు… తమ నియోజకవర్గాల్లో జరిగిన పరిణామాలపై సుదీర్ఘంగా వివరించారు. వేలమందితో ఒకేసారి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లను సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు తప్పుబట్టారు. వేలమందితో కాన్ఫరెన్స్‌ వల్ల వాస్తవాలు చెప్పే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో హ్యూమన్‌ టచ్‌ పోయిందన్నారు జూపూడి ప్రభాకర్‌. కార్యకర్తలకు, నేతలకు చంద్రబాబు బాగా దూరం అయ్యారని.. అందుకే పార్టీ ఓడిపోయిందని విశ్లేషించారు. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కొంప ముంచిందన్నారు ఎమ్మెల్సీ గౌరవాని శ్రీనివాసులు. ఇక కోడెల అక్రమాలపై జనం ఎన్నికల సమయంలోనే ప్రస్తావించారని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి తన అభిప్రాయాలు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సమావేశంలో పాల్గొన్న నేతలు చెప్పిన మాటల్ని చంద్రబాబు పూర్తిగా విన్నారు. క్షేత్రస్థాయిలో కారణాలపై లోతైన విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. గతంలోనూ పార్టీ ఓటమి పాలైనా.. తిరిగి విజయం సాధించిందని.. ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్నారు. భవిష్యత్‌లో గెలుపు ఖాయం అన్నారు.

రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పుడు మాత్రమే…, ప్రజలు చంద్రబాబును నాయకుడిగా కోరుకుంటున్నారని తన అభిప్రాయం వ్యక్తం చేశారు ఎంపీ గల్లా జయ్‌దేవ్. ఓటమికి అనేక కారణాలున్నాయని.. సోషల్‌ ఇంజనీరింగ్‌ కూడా అందులో ఓ కారణం అని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సమావేశంలో కార్యకర్తలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని…, వారిని కాపాడుకుంటామన్నారు చంద్రబాబు. ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీ దాడుల్లో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు చనిపోయారని.. వారికి పార్టీ తరపున ఐదేసి లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. దాడుల్ని నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓటమిపై మరింత లోతైన విశ్లేషణ జరగాల్సి ఉందని టీడీపీ నేతలు తేల్చారు. ఇందుకోసం పార్టీ అధినేత చంద్రబాబు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఓటమికి గల కారణాలపై త్రిసభ్య కమిటీ నివేదిక తయారుచేస్తుందని స్పష్టం చేశారు. పార్టీని ముందుకు తీసుకెళ్లడం చారిత్రక అవసరమని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close