చార్జిషీట్లు ఎందుకు..? జైలుకు పంపి ఉండేవారు కాదా..?

రఘురాం సిమెంట్స్ అలియాస్.. భారతి సిమెంట్స్‌ మనీలాండరింగ్ వ్యవహారాల్లో ఈడీ చార్జిషీట్ వేయడాన్ని అందులో భారతి పేరు చేర్చడాన్ని… వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు కుట్రగా చెబుతున్నారు. తన కుటుంబాన్ని వేధిస్తున్నారని… సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. తన పార్టీ నేతలతో అదే చెప్పిస్తున్నారు… తాను కూడా అదే చెబుతున్నారు. ఈ విషయంలో ప్రజలను నమ్మించడానికి నానా పాట్లు పడుతున్నారు. కాంగ్రెస్‌తో పాటు.. బీజేపీతోనూ.. చంద్రబాబు కమ్మక్కయ్యారని చెప్పుకొస్తున్నారు. దాని కోసం… కొన్ని కొన్ని ఘటనలను భూతద్దంలో చూపిస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో ఆ తర్వాత బీజేపీతో అంటూ లింకులు కలిపేస్తున్నారు.

ఎలాగైనా.. భారతిపై చార్జిషీటు విషయంలో పూర్తిగా చంద్రబాబునే కారణంగా చూపితే.. రాజకీయంగా లాభం కలుగుతుందని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ టీడీపీ నతేలు మాత్రం చాలా తేలికగా… ఈ వాదనను కొట్టి పడేస్తున్నారు. వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు మేనేజ్ చేస్తున్నాడని జగన్ అనడంపైనా వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు చేయగలిగి ఉంటే.. కేంద్రంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడే జగన్ కేసులు ఓ కొలిక్కి తెచ్చి ఉండేవని చెబుతున్నారు. అదే జరిగి ఉంటే.. ఈ పాటికి శశికళ, లాలూ ప్రసాద్ యాదవ్‌లా జగన్ జైలుకు వెళ్లి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హతకు గురయ్యేవారని గుర్తు చేస్తున్నారు.

మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వ్యవహారం.. ప్రజల్లో తేడా కొట్టేలానే కనిపిస్తోందని వైసీపీ నేతలు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే కుటుంబసభ్యులను కూడా బినామీలుగా వాడుకుని.. వారిని కూడా కోర్టు మెట్లెక్కిస్తున్నారని జగన్ పై సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో తన డిపాజిట్లు తప్పు అని జగన్ ఎక్కడా చెప్పడం లేదని… గుర్తు చేస్తున్నారు. కేసులతో భారతీకి ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారు కానీ.. అసలు భారతి సిమెంట్స్ అనే కంపెనీనే ఆమె పేరుపై ఉన్న విషయాన్ని దాచి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి చార్జిషీటు విషయం మొత్తం చంద్రబాబు కుట్ర అని… వేధిస్తున్నారని.. జగన్ చేస్తున్న సానుభూతి ప్రయత్నాలు ఫలించవని టీడీపీ నేతలు చెబుతున్నారు. వారు మరింత జోరుగా… చంద్రబాబు చేయగలిగితే… జగన్‌ను ఎప్పుడో జైలుకు పంపేవారు కాదా.. అన్న రివర్స్ ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com