టీ బీజేపీ హెచ్చరికల్లో హిట్ – ఆకర్ష్‌లో ఫట్ !

తెలంగాణ బీజేపీ నేతలు గంభీరమైన ప్రకటనలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. టీఆర్ఎస్‌లో భూకంపం వస్తుందంటారు. బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందంటారు. కుప్పలు తెప్పలుగా లీడర్లు బయటకు వచ్చేసి బీజేపీలోచేరుతారంటారు. కానీ వారు మాత్రం రిటైరైపోయిన రాజకీయ నేతలను ప్లీజ్.. ప్లీజ్ పార్టీలోకి రండి అని బతిమాలుకుంటున్నారు. చివరికి టీఆర్ఎస్‌లో చాన్స్ లేదని.. రాదని భావిస్తున్న నేతల్ని కూడా కన్విన్స్ చేయలేకపోతున్నారు. కానీ కాంగ్రెస్ నేతల్ని మాత్రం పట్టుబట్టి లాగేస్తున్నారు. బీజేపీ నేతల తీరు తెలంగాణలో చర్చనీయాంశమవుతోంది.

టీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఆకర్ష్ ఏ మాత్రం పని చేయడం లేదు. టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతున్న తుమ్మల, పొంగులేటి, జూపల్లి, మహేందర్ రెడ్డి లాంటి మాస్ లీడర్లు సహా అనేక మందితో సంప్రదింపులు జరుపుతున్నా .. వారి మనసు మార్చలేకపోతున్నారు. కానీ కాంగ్రెస్‌లో ఉన్న బడా కాంట్రాక్టర్ల నుంచి చిన్న పాటి వ్యాపారుల వరకూ ఎవర్నీ వదిలి పెట్టకుండా లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డితో పట్టుబట్టి రాజీనామా చేయించిన ఆ పార్టీ నేతలు.. మరో పది మందితో రాజీనామాలు చేయించి ఉపఎన్నికలు తెస్తామని చాలెంజ్ చేశారు. కానీ ఒక్కరు కూడా రెడీ కాలేదు.

కాంగ్రెస్ పార్టీ నేతలపై మాత్రం వరుసగా గురి పెడుతున్నారు. దాసోజు శ్రవణ్‌ను… నడ్డా, షాల సభ 21వ తేదీన ఉంటుందని తెలిసినా ముందే కండువా కప్పేశారు. రాజగోపాల్ రెడ్డి అనుచరులందరికీ ఆహ్వానం పంపుతున్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఖాళీగా ఉంటే వారినీ పిలుస్తున్నారు. కాంగ్రెస్ నేతల్ని చేర్చుకుని జబ్బ చరుచుకుంటున్నారు కానీ… టీఆర్ఎస్ నేతల్ని మాత్రం ఇంకా ఆకట్టుకోలేకపోతున్నారు. మునుగోడులో ఫలితం తేడా వస్తే .. ఆ కాంగ్రెస్ నేతలు కూడా జంప్ అయ్యే చాన్సే ఎక్కువ ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close