మీడియా వాచ్‌: పేపర్ రేట్లు పెంచేస్తున్నారట..!

సాక్షి పత్రిక వచ్చిన కొత్తలో ఓ నినాదం ఉద్యమంలా తీసుకొచ్చారు. ఆ పత్రిక ధరను..రూ.2గా నిర్ణయించారు. మిగతా పత్రికలు కూడా.. రూ. 2కే ఎందుకివ్వరని ప్రశ్నలు ప్రారంభించారు. పాఠకుల దగ్గర నుంచి డిమాండ్లు కూడా వినిపించారు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. సాక్షి పత్రిక రేటు మిగతా పత్రికలతో సమాన స్థాయికి చేరింది. మామూలు రోజుల్లో రూ. 5, మిగతా రోజుల్లో రూ. 6గా కొనసాగుతోంది. ఇప్పుడు సాక్షి ఇతర పత్రికల రేట్లను తగ్గించాలని ఉద్యమాలు చేయడం లేదు. ఇతర పత్రికలతో కలిసి పోటీగా.. రేట్లు పెంచడానికి .. అవకాశం ఎదురు చూస్తోంది. గతంలో ఎలా ఉన్నా.. ఇటీవలి కాలంలో.. పత్రికల యజమానులంతా.. ఓ సంఘంగా ఏర్పడ్డారు. పత్రికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై కలసికట్టుగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కొద్ది రోజుల క్రితం సమావేశమై.. ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే.. పేపర్ రేట్లు పెంచడం.

ప్రస్తుతం రూ. 5 ఉన్న వీక్‌డేస్ పేపర్‌ను రూ. 8కి , ఆదివారాల్లో రూ. 10 రూపాయలకు పెంచాలనే ప్రతిపాదన… సిద్దం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో పెరిగిన న్యూస్ ప్రింట్ ధరలు, ట్రాన్స్‌ పోర్ట్ చార్జీలు, ఉద్యోగుల జీతాలు చూసుకుని… రేట్లు పెంచకపోతే.. లాభాలకు గండి పడిపోతుందని.. నిర్ణయించేసుకున్నారు. కానీ ఒకే సారి.. 70 శాతం రేటు పెంచితే… సర్క్యూలేషన్ పై దెబ్బ పడుతుందేమోనన్న భయం వీరిలో చాలా మందికి ఉంది. ముఖ్యంగా .. సాక్షి దినపత్రికు ఎక్కువ. ఎందుకంటే.. ఆ పత్రికను… వైసీపీపై అభిమానంతో కొంత మంది కొనుగోలు చేస్తూంటే.. మరికొంత సర్క్యూలేషన్ .. బలవంతంగా అంట గడుతున్నది ఉంది. అమాంతం రేట్లు పెంచితే.. వాళ్లంతా నిస్సంకోచంగా వదిలించేసుకుంటారనే భయం సాక్షికి ఉంది. మిగతా పత్రికలూ దీనికి మినహాయింపు కాదు. కాకపోతే… ఆ పత్రికకు ఉన్నంత ఎఫెక్ట్ ఉండదు. అందుకే అందకూ చర్చించుకుని ఆ స్థాయిలో కాకపోయినా… కనీసం రూపాయి నుంచి రెండు రూపాయల వరకూ పెంచడం మాత్రం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.

ఒక్క తెలుగు పేపర్లు మాత్రమే కాకుండా.. ఇంగ్లిష్ పేపర్లు కూడా.. రేట్లు పెంచే ఆలోచన చేస్తున్నాయట. ఇప్పటికే దీనికి సంబంధించి అంతర్గతంగా.. చర్చలు అన్నీ పూర్తి చేసేసుకున్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచే అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. పెంచితే అన్ని పేపర్ల ధరలూ పెరగుతాయి తప్ప… ఒకటి పెరగడం..మరోకటి పెంచకుండా ఉండటం మాత్రం జరగదు. ఈ విషయంలో పత్రికా యజమాన్యాలు క్లారిటీతోనే ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close