అక్కడ అడగలేక.. ఇక్కడ ఆగ్రహిస్తే ఎలా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకు రావడం అనేది ఎంత చెడ్డా తెలుగుదేశం పార్టీ ఎంపీలకు కాస్త క్లిష్టమైన విషయమే. హోదా విషయంలో పోరాడాలనే సంకల్పం వారిలో ఎంత బలంగానైనా ఉండవచ్చు గానీ.. వాస్తవంలో.. పార్టీ అధినేత నుంచి మాత్రం ఆ పోరాటాలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించదు. ‘సానుకూలంగా ఉంటూనే మనకు కావాల్సింది సాధించుకోవాలి’ అనే తరహా నిరుపయోగమైన మాటల ద్వారా చంద్రబాబునాయుడు వారికి కళ్లేలు వేస్తూ ఉంటారు. ఎంపీల పరిస్థితే ఇలా ఉంటే కేంద్రంలో మంత్రి పదవులు వెలగబెడుతున్న తెదేపా వారికి పరిస్థితి ఇంకా ఇరకాటంగానే ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ప్రజల ముందుకు వచ్చినప్పుడు మాత్రం ఏదో ఒక రకమైన వంచనా శిల్పంతో ఆ నిమిషం నెగ్గుకు వస్తే చాలునని వారు డైలాగులు వల్లించడం వలన మరింతగా హోదా ను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శల ఊబిలో చిక్కుకుపోతున్నారు.

తెదేపాకు చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరికి ఇలాంటి సంకట పరిస్థితే ఎదురైంది. విజయవాడలో మేడే కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు కూడా అందరూ ఆయనను ప్రత్యేకహోదా గురించే ప్రశ్నించారు. విలేకరులైతే హోదా గురించి తెదేపా ఏం చేయబోతున్నదంటూ ప్రశ్నలు శరపరంపరంగా వేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం తెదేపా కేంద్రమంత్రులు రాజీనామాలు చేసి, మోడీ సర్కారుపై ఒత్తిడి పెంచుతారా? వంటి ప్రశ్నలు కూడా ఎదురయ్యే సరికి, పాపం.. మంత్రి గారికి చిరాకెత్తింది. ‘మా రాజీనామాలతో హోదా వస్తుందంటే.. చేసేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీడియా వారికే రాజీనామా లేఖలు ఇచ్చేస్తాం.. మీరు వెళ్లి ప్రత్యేకహోదా తీసుకువస్తారా’ అంటూ కోపంతో ఊగిపోయారు.

కేంద్ర కేబినెట్‌లో ఉన్న వారికి రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో ఖచ్చితంగా అదనపు బాధ్యత ఉంటుంది. పైగా విభజన చట్టం ప్రసాదించే వెసులుబాటులను కూడా కేంద్రం కాలరాస్తున్నప్పుడు అక్కడ ప్రశ్నించలేకపోతే.. వీరు అసలు ఉన్నది ఎందుకు? అనే ప్రశ్న జనానికి వస్తుంది. కేబినెట్‌లో తమ రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రశ్నించే సత్తాలేక, ఆ అసమర్థతను, మీడియా వారి మీద ఆగ్రహంగా మళ్లిస్తే ఎలా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సుజనాచౌదరి వంటి వారు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకుండా కేంద్రంలో ఉన్నది మా మిత్ర పక్షమే.. మేం హోదా కోసం పోరాడుతున్నాం.. వంటి మాయమాటలతో పొద్దుపుచ్చాలని ఆలోచించినంత కాలమూ వారికి ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయని తెలుసుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close