అప్పుడు ‘శ్రీ‌నివాస క‌ల్యాణం’.. ఇప్పుడు ‘థ్యాంక్యూ’

దిల్ రాజు జ‌డ్జిమెంట్ కి తిరుగు ఉండ‌ద‌న్న‌ది అంద‌రి న‌మ్మ‌కం. అది చాలా సంద‌ర్భాల్లో నిజం అయ్యింది కూడా. దిల్ రాజు ఖాతాలో కొన్ని ఫ్లాపులు ఉండొచ్చు. అనూహ్య‌మైన ప‌రాజ‌యాలు ఎదురుకావొచ్చు. అయితే వాటిని దిల్ రాజు ముందే ప‌సిగ‌ట్టేవారు. రెండే రెండు సంద‌ర్భాల్లో దిల్ రాజు సినిమాపై ప్రేమ పెంచుకొన్న సినిమాలు పెద్ద దెబ్బ కొట్టాయి. ఒక‌టి… శ్రీ‌నివాస క‌ల్యాణం, రెండోది థ్యాంక్యూ.

స‌తీష్ వేగ్నేశ‌తో `శ‌త‌మానం భ‌వ‌తి` తీశాక‌.. ఆయ‌న‌పై బాగా న‌మ్మ‌కం కుదిరింది. వెంట‌నే `శ్రీ‌నివాస క‌ల్యాణం`తో మ‌రో అవ‌కాశం ఇచ్చారు దిల్ రాజు. ఈ సినిమాపై దిల్ రాజుకి గట్టి న‌మ్మ‌కం ఉండేది. రేపు సినిమా రిలీజ్ అన‌గా.. సినిమా ఓసారి చూసుకొని, మురిసిపోయార్ట దిల్ రాజు. `ఈ సినిమాతో మ‌రోసారి వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పేరు మార్మోగిపోతుంది` అని బ‌లంగా న‌మ్మారు. కానీ తీరా చూస్తే.. సినిమా డిజాస్ట‌ర్‌. దిల్ రాజు కెరీర్‌లో అదో పెద్ద ఫ్లాప్‌.

ఇప్పుడు థ్యాంక్యూ కూడా అంతే. ఈ సినిమాకీ బాగా క‌నెక్ట్ అయిపోయారాయ‌న‌. షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు సెట్లో కొన్ని సీన్స్ చూసి ఎమోష‌న్ అయిపోయార్ట‌. అందుకే త‌న కెరీర్‌లో త‌న‌కు సాయం చేసిన‌వాళ్లంద‌రికీ `థ్యాంక్యూ` చెప్ప‌డానికి, ఈసినిమాలో నాగ‌చైత‌న్య‌లా ఆయ‌నో జ‌ర్నీ చేశారు. దాదాపు స‌గం మందిని క‌లిశారు కూడా. వాట‌న్నింటినీ ఓ వీడియోగా రూపొందించి, రిలీజ్ చేద్దామ‌నుకొన్నారు. తీరా చూస్తే.. ధ్యాంక్యూ ఫ్లాప్ అయ్యింది. ఈసినిమాకి ఓపెనింగ్స్ కూడా లేవు. ఏం చూసుకొని, ఈ సినిమాపై దిల్ రాజు ఇన్ని ఆశ‌లు పెట్టుకొన్నాడో ఎవ్వ‌రికీ అర్థం కాలేదు. ఆర్థిక లావాదేవీలు, క‌లెక్ష‌న్లూ ప‌క్క‌న పెడితే.. ఈ క‌థ‌తో ఎమోష‌న్‌గా జ‌ర్నీ చేశారు దిల్ రాజు. ఇప్పుడు అదే పెద్ద దెబ్బ కొట్టేసింది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close