సుప్రీంకోర్టు కాదు.. హైకోర్టుకే..!

ఎన్నికలు నిర్వహించవద్దని ప్రభుత్వం అదే పనిగా చెబుతున్నప్పటికీ.. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో న్యాయపోరాటం చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లబోతోందన్న ప్రచారం జరిగింది. అయితే నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్తే.. హైకోర్టును ఆశ్రయించాలన్న సూచనలు వస్తాయని న్యాయనిపుణులు ప్రభుత్వ వర్గాలకు చెప్పడంతో.. వ్యూహం మార్చుకుంది. హైకోర్టునే ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. రాత్రి నుంచి ప్రభుత్వానికి చెందిన న్యాయనిపుణులు.. అడ్వకేట్ జనరల్ కార్యాలయం… కసరత్తు జరిపి చివరికి హౌస్ మోషన్ పిటిషన్ ను రూపొందించారు. అనేక పత్రాలు జత చేశారు. అయితే.. ఈ కసరత్తు అంతా పూర్తయ్యే సరికి మధ్యాహ్నం అయింది.

కోర్టు సమయం ముగిసే ముందుగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు ఇప్పటికే సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి. అత్యవసర పిటిషన్లు విచారించడానికి ముగ్గురు న్యాయమూర్తులు మాత్రమే అందుబాటులో ఉంటారు. ఈ కారణంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆలస్యం కావడంతో.. విచారణకు రాలేదు. హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు… సమయం ముగిసిపోవడంతో సోమవారం విచారిస్తామని తెలిపింది. తన పిటిషన్‌లో ప్రభుత్వం ప్రధానంగా కరోనా వ్యాక్సినేషన్, ఉద్యోగుల భద్రతను కారణంగా చెప్పింది.

ఈ కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సోమవారం హైకోర్టు ఎన్నికల నిర్వహణపై స్టే ఇస్తే.. ప్రభుత్వానికి రిలీఫ్ దొరికినట్లవుతుంది. లేకపోతే.. ఎన్నికల నిర్వహణ అయిష్టంగానైనా ప్రారంభించక తప్పదు. కోర్టుల్లో వేసిన పిటిషన్లకు మ్దదతుగా ఇప్పటికే.. ఉద్యోగ సంఘాల నేతలందరితోనూ ప్రెస్‌మీట్లు పెట్టించారు. విజ్ఞప్తులు చేయించారు. హెచ్చరికలు కూడా చేయించారు. స్థానిక ఎన్నికలపై సోమవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close